టిటిడిలో రజకులు కులవృత్తి చేసుకోడానికి సిఎంతో చర్చిస్తాను : బియ్యపు మధుసూదన్ రెడ్డి

శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని రజక ఆత్మీయ సమావేశం ఏర్పేడు లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డికి విన్నవించుకున్నారు. ప్రధానంగా రేణిగుంట, ఏర్పేడు, శ్రీకాళహస్తి మండలాలకు చెందిన రజక మహిళలు తమ ఇబ్బందులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. సమావేశంలో పాల్గొన్న అందరికీ మాట్లాడే అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి వారి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రసంగించిన మధుసూదన్ రెడ్డి రజకులకు పాలు హామీలు ఇచ్చారు.

◆ తన నియోజకవర్గంలోని ప్రతి రజక కుటుంబానికి ప్రభుత్వం తరపున ₹10,000 మంజూరు చేస్తాం.

◆ తక్షణం నియోజకవర్గ పరిధిలోని రజకులకు దోబి కాన ఏర్పాటు చేస్తాం.

◆ శ్రీకాళహస్తి పట్టణానికి నాలుగువైపులా నూతనంగా ధోబిఖానాలు ఏర్పాటు చేస్తాం

◆ అనుమతులన్నీ ఉన్నప్పటికీ పెండింగ్ లో ఉన్న రేణిగుంట మండలం తూకీవాకం రజక ధోబీఖావా పనులు చేయాల్సిందిగా రేణిగుంట ఎమ్మార్వో కి ఆదేశాలు ఇస్తాం.

◆ ఇళ్ల స్థలాలు లేని రజక కుటుంబాలకు ఈ ఉగాది లోపే నూతన గృహాలను మంజూరు చేయడానికి ఏర్పాట్లు చేస్తాం.

◆ టీటీడీలో రజకులు తమ కులవృత్తి చేసుకోవడానికి ఏర్పడిన అవరోధాలను పరిశీలించి… ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లి న్యాయం చేస్తాం.

◆ రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలన్న అంశాన్ని… రజక సంఘం రాష్ట్ర నాయకుల సహకారంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకుని వెళ్తాం.

◆ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో రజకులకు న్యాయం జరిగేలా చేస్తాం.

◆ నియోజకవర్గంలోని నామినేటెడ్ పదవులలో అవకాశాన్ని బట్టి రజకులకు న్యాయం చేస్తాం.

◆ ప్రభుత్వం బడ్జెట్లో బీసీలకు కేటాయించిన నిధులను ఉపయోగించి నియోజక వర్గంలోని రజకులకు న్యాయం చేస్తాం.

  • ధర్మచక్రం ప్రతినిధి, శ్రీకాళహస్తి

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*