టిటిడి అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల‌కు కరోనా సోకదా..?

ధర్మచక్రం ప్రతినిధి – తిరుపతి

ఒక్కోసారి తిరుమల‌ తిరుపతి దేవస్థానం (టిటిడి) అధికారులు తీసుకునే నిర్ణయాలు, చేపట్టే చర్యలు తర్కానికి అందకుండా ఉంటాయి. కరోనా విపత్తు వేళ అటువంటి వ్యవహారం ఒక‌టి చ‌ర్చ‌కు వ‌చ్చింది.

కరోనా లాక్ డౌన్‌కు సడలింపులు వచ్చిన నేపథ్యంలో….టిటిడి ఉద్యోగుల‌ను విధుల‌కు హాజరు కావాల్సిందిగా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. రోజుకు 33 శాతం ఉద్యోగులు విధిగా డ్యూటీకి రావాని చెప్పారు. గడచిన మూడు రోజులుగా ఇది అమవుతోంది.

విధుల‌కు హాజరవుతున్న ఉద్యోగుల‌ ఆరోగ్యాన్ని, తోటి ఉద్యోగుల‌ భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఉద్యోగికీ ఒక శానిటైజర్‌ బాటిల్‌, రెండు గుడ్డ మాస్కులు, మూడు సర్జికల్‌ మాస్కులు ప్ర‌తి ఉద్యోగికీ ఉచితంగా అందజేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇటువంటి జాగ్రత్తలు త‌ప్ప‌నిస‌రి.

ఇదంతా బాగానే ఉందిగానీ….టిటిడి పరిపాల‌నా భవనంలో పనిచేసే అవుట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగుల‌కు మాత్రం మాస్కులు, శానిటైజరు ఇవ్వలేదు. అడిగితే…రెగ్యుర్‌ ఉద్యోగుల‌కు మాత్రమే ఇస్తున్నాం అని సంబంధిత విభాగాధిపతులు చెబుతున్నారట. అవుట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగులు సరైన జాగ్రత్తలు తీసుకోకుండా కార్యాయాల‌కు వస్తే…అది పక్కనే పని చేసే రెగ్యుర్‌ ఉద్యోగుల‌కు ప్రమాదం కాదా? అవుట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగుల‌కు కరోనా సోకదా?!

అయినా….కాంట్రాక్టు ఉద్యోగుల‌కూ మాస్కులు ఇస్తే ఎంత ఖర్చవుతుంది? ఇటువంటి స్వ్ప ఖర్చుల‌ విషయంలోనూ టిటిడి ఆలోచించాలా? ఈ విధంగా కాంట్రాక్టు ఉద్యోగుల‌ను చిన్నచూపు చూడాలా? అని సంబంధిత ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా తమపట్ల చిన్నచూపు పోవాల‌ని వారు కోరుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*