టిటిడి అవుట్‌ సోర్సింగ్‌ కార్మికుల భవితవ్యం ఏమిటి..? కార్పొరేషన్ లో చేర్చడం మేలా కీడా..!

ధర్మచక్రం ప్రతినిధి – తిరుపతి

టిటిడిలో పని చేస్తున్న 14,000 మంది అవుట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టు కార్మికులు తమ భవితవ్యంపై ఆందోళన చెందుతున్నారు. సంస్థలో పని చేస్తున్న కార్మికులను, ‌రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అవుట్‌ సోర్సింగ్‌ కార్పొరేషన్‌లో చేర్చాలని టిటిడి తీసుకున్న నిర్ణయంపై సరైన వివరాలు లేక, స్పష్టత కరువై టెన్షన్‌ పడుతున్నారు. కార్పొరేషన్‌లో చేర్చేసి, ఇక తమకు సంబంధం లేదని టిటిడి చేతులు దులుపుకుంటుందా, ఏదైనా ఇబ్బంది వస్తే ఎవర్ని అడగాలి, కార్పొరేషన్‌లో చేరాక టైం స్కేలు, రెగ్యురైజేషన్‌ వంటివి ఉంటాయా, అసలు కార్మికుందరినీ అందులో చేర్చుతారా, వర్క్‌ కాంట్రాక్టులో ఉన్న వారిని మినహా యిస్తారా….అనే అనేక అనుమానాలు కార్మికుల్లో ఉన్నాయి.

టిటిడిలో రెగ్యుర్‌ ఉద్యోగులు 7,500 మందిదాకా ఉంటే….అవుట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగులు 14,000 మందికిపైగా ఉన్నారు. ఇందులోనూ 10,000 మంది దాకా సొసైటీలు, పర్సనల్‌ కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తున్నారు. 4,000 మందికిపైగా వర్క్‌ కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తున్నారు. ఇలా పని చేస్తున్న వారిలో 15 ఏళ్ల సర్వీసు ఉన్నవారూ ఉన్నారు.

తమను రెగ్యుర్‌ చేయాలని, టైంస్కేలు ఇవ్వాలని అవుట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టు కార్మికులు ఏళ్ల తరబడి ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. గత ప్రభుత్వం వారి గురించి పట్టించుకున్న పాపానపోలేదు. జగన్‌ మోహన్‌ రెడ్డి పాదయాత్ర సందర్భంగా…..టిటిడి అవుట్‌ సోర్సిగ్‌, కాంట్రాక్టు కార్మికులు ఆయన్ను కలిసి, తమ గోడు వెల్లబోసుకున్నారు. వైసిపి అధికారంలోకి వచ్చిన వెంటనే…అవకాశం ఉన్న వారిని రెగ్యుర్‌ చేస్తామని, మిగతా వారికి టైం స్కేలు ఇస్తామని, కాంట్రాక్టర్లు లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు.

వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదవుతోంది. ఈ మధ్యలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘స్టేట్‌ అవుట్‌ సోర్సింగ్‌ కార్పొరేషన్‌’ ఏర్పాటు చేసి, రాష్ట్ర వ్యాపితంగా ఉన్న అవుట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టు కార్మికులను ఇందులో చేర్చాని నిర్ణయించింది. సంస్థకు, కార్మికులకు మధ్య కాంట్రాక్టర్లు లేకుండా…ఈ సంస్థ ద్వారానే జీతాలు ఇస్తామని ప్రకటించింది. దీనివల్ల కార్మికులకు ఉద్యోగ భద్రత లభిస్తుందని, కాంట్రాక్టరు మారినపుడల్లా కార్మికులను తీసేయడం వంటివి ఉండవని ప్రభుత్వం చెప్పింది.

ఈ అవుట్‌ సోర్సింగ్‌ కార్పొరేషన్‌లోనే… టిటిడి కార్మికునూ చేర్చాని పాలక మండలి తీర్మానించింది. కొద్ది రోజు క్రితమే టిటిడిలో పని చేస్తున్న కార్మికుల వివరాలను కార్పొరేషన్‌కు పంపినట్లు తెలుస్తోంది. అయితే…ఈ నిర్ణయంపై టిటిడి కార్మికుల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆర్థిక ఇబ్బందులు లేని టిటిడిలో పని చేస్తున్న తమను రెగ్యులర్‌ చేయడమో, కనీసం టైం స్కేలు ఇవ్వడమో చేయకుండా….ఇలా అవుట్‌ సోర్సింగ్‌ కార్పొరేషన్‌లో చేర్చడం వెనుక ఆంతర్యం ఏమిటని కార్మికులు ప్రశ్నిస్తున్నారు.

ఒకసారి కార్పొరేషన్‌లో చేర్చేస్తే…ఇక ఏ సమస్య వచ్చినా టిటిడి అధికారులు పట్టించుకోరని, అమరావతికి వెళ్లి కార్పొరేషన్‌ అధికారులతో మాట్లాడుకోవాల్సి వస్తుందని భయపడుతున్నారు. కార్పొరేషన్‌లో చేరితే ఒక సంస్థ నుంచి ఇంకో సంస్థకు బదిలీ చేసే పరిస్థితి కూడా ఉంటుందని ఆందోళన చెందుతున్నారు. అప్పుడు టిటిడి కార్మికుమన్న గుర్తింపు కోల్పోతామని వాపోతున్నారు. అదీకాకుండా…తమ సర్వీసు రెగ్యురైజేషన్‌ గురించి టిటిడి పట్టించుకోదన్న భయం కూడా వారిని వెంటాడుతోంది.

ప్రభుత్వ అవుట్‌ సోర్సింగ్‌ కార్పొరేషన్‌తో నిమిత్తం లేకుండా….టిటిడిలో ప్రస్తుతం ఉన్న పద్ధతినే కొనసాగించాని కోరుతున్నారు. టిటిడినే ఒక చిన్నపాటి ప్రభుత్వంతో సమానమైనదని, టిటిడిలో ఇప్పటికే సెంట్రల్‌ అవుట్‌ సోర్సింగ్‌ సెల్‌ ఉందని, దీన్ని బలోపేతం చేసి తమను కొనసాగించాని విజ్ఞప్తి చేస్తున్నారు. కాంట్రాక్టర్లు లేకుండా టిటిడి మొత్తంగా కార్మికుతోనే సొసైటీలు ఏర్పాటు చేయాని, వర్క్‌ కాంట్రాక్టు తొగించాని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మేరకు ఆందోళనలకూ సన్నద్ధమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో టిటిడి ఉన్నతాధికారులు, పాలక మండలి పెద్దలు స్పందించి కార్మిలకు విషయంలో స్పష్టత‌ ఇవ్వాల్సిన అవసరం ఉంది.

టిటిడి‌ కార్మికులను‌ కార్పొరేషన్ లో కలపొద్దంటూ ప్లకార్డు ప్రదర్శిస్తున్న టిటిడి ఉద్యోగ సంఘాల నేత నాగార్జున

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*