టిటిడి ఈవో సింఘాల్‌ దీర్ఘాలోచన దేని గురించి?

ఈనెల 5న తిరుమలలో జరిగిన టిటిడి ధర్మకర్తల మండలి సమావేశంలో తీసిన ఫొటో ఇది. సభ్యులంతా చర్చిస్తుండగా ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ దీర్ఘాలోచనలో ముగినిపోయారు. ఇంకో విధంగా చెప్పాలంటే ముభావంగానూ కనిపిస్తున్నారు. ఈ దీర్ఘాలోచన వెనుక ఆయన మస్థిస్కలో ఏ ఆలోచనలు సుడులు తిరుగుతన్నాయి? ఆయన అంతగా ఏమి ఆలోచిస్తున్నారు??

టిటిడి కార్యనిర్వహణాధికారిగా పని చేయడానికి సీనియర్‌ ఐఏఎస్‌లంతా తీవ్రంగా పోటీపడుతుంటారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి కంటే టిటిడి ఈవోగా ఉండటానికే ఇష్టపడేవారు ఉన్నారు. అలాంటి పదవిని, ఎన్ని ఆటంకాలు ఎదురైనా తన పలుకుబడితో సంసాదించుకోగలిగారు అనిల్‌ కుమార్‌ సింఘాల్‌. ఉత్తర భారీతీయుడు టిటిడి ఈవోగా ఎలా పనికొస్తారని కొందరు ప్రశ్నించారు. అన్నింటికీ సమాధానం అనేట్లుగా ఆ తేడా కనిపించకుండా తన పనితీరు ద్వారా సమాధానం చెప్పారు.


అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో రమణ దీక్షితులు రూపంలో వచ్చిన వివాదం ఈవోను ఆందోళనకు గురిచేస్తున్నట్లుంది. శ్రీవారి ఆలయంలో కీలకంగా ఉన్న ఓ ప్రధాన అర్చకున్ని ఆకస్మికంగా తొలగించాల్సివస్తుందని, ఆయనపై కేసులు పెట్టేలా నిర్ణయం చేయాల్సివస్తుదని సింఘాల్‌ ఎప్పుడూ ఊహించివుండకపోవచ్చు. రమణ దీక్షితులుపై ఇటువంటి కఠిన చర్యలు తీసుకోడానికి ఈవో మొదటి నుంచి అయిష్టంగానే ఉన్నట్లు చెబుతున్నారు. టిటిడిపై చేసిన విమర్శల నెపంతో రాత్రికి రాత్రి రమణ దీక్షితులును తొలగిస్తే వివాదం అవుతుందని ఆయనకు తెలుసు. అయినా గత్యంతరం లేక నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు కేసులు పెట్టాలన్న నిర్ణయాన్ని కూడా ఆయన వ్యతిరేకించినట్లు చెబుతున్నారు. కేసుల దాకా వెళ్లకూడదని ఆయన చెప్పినా బోర్డు సభ్యులు కేసులు పెట్టాల్సిందేనని పట్టుబట్టడంతో… ఒక దశలో ఈవో సమావేశం నుంచి వెళ్లిపోయినట్లు వార్తలొచ్చాయి. అయినా బోర్డులో ఒక సభ్యునిగా, ఈవోగా బోర్డు నిర్ణయాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఆయనపైన ఉంటుంది. అందుకే మొదటి నుంచి అన్నీ తనపైన వేసుకుని నిర్ణయాలను అమలు చేస్తున్నారు.

టిటిడి వివాదాలకు సంబంధించి బోర్డు సభ్యులు, అధికారుల అభిప్రాయాల కంటే ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందనేది బహిరంగ రహస్యం. దీంతో ఈవో తన అభిప్రాయాన్ని గట్టిగా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. రమణ దీక్షితులు కోర్టు నుంచి స్టే తెచ్చుకుంటే దాన్ని అమలు చేయడానికి కూడా ఈవో సిద్ధంగా ఉన్నారు. ఈ మాటను ఆయన స్వయంగా చెప్పారు. ‘కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా అమలు చేస్తాం’ అని మీడియా సమావేశంలోనే చెప్పారు. ఇలాంటి అలోచనలు ఆయన మనసులు సుడులు తిరుగుతుండొచ్చు. అందుకే అంత దీర్ఘాలోచనలో కనిపిస్తున్నారు సింఘాల్‌.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*