టిటిడి ఈవో సింఘాల్‌ బదిలీ తప్పదా…!

తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఈవోగా పని చేస్తున్న అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ బదిలీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈవోగా ఆయన పదవీ కాలం ఈనెల 8వ (08.05.2020) తేదీతోనే  ముగిసింది. అయితే ఇప్పటిదాకా ఆయన కొనసాగింపుపై ప్రభుత్వం నుంచి ఎటువంటి ఉత్తర్వులూ వెలువడలేదు.

అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ మే 6, 2017న టిటిడి ఈవోగా నియమితులయ్యారు. 09.05.2019తో ఆయన పదవీకాం ముగియనుండగా….మరో ఏడాది పొడిగిస్తూ అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. సాధారణంగా పదవీకాలం ముగియడానికి వారం అటూఇటూగా ఉత్తర్వులు వస్తాయి. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం….పదవీ కాలానికి రెండు నెల ముందుగానే ఏడాది పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో 08.05.2020 దాకా పదవిలో కొనసాగే అవకాశం సింఘాల్‌కు లభించింది.

ఎన్నికలయ్యాక రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. చంద్రబాబు హయాంలో నియమితులైన సింఘాల్‌ బదిలీ తప్పదన్న ప్రచారం జరిగింది. అయితే…ఢల్లీ స్థాయిలో తనకున్న పలుకుబడిని ఉపయోగించుకుని అదే పదవిలో కొనసాగుతున్నారు సింఘాల్‌. ప్రభుత్వ చీఫ్‌ సెక్రెటరీ కంటే గొప్పదిగా భావించే టిటిడి ఈవో పోస్టులో పని చేయాన్న కోరిక చాలామంది సీనియర్‌ ఐఏఎస్‌లకు ఉంటుంది. జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే…పలువురు సీనియర్లు ఈవో పోస్టు కోసం ప్రయత్నంచారు. ఈయితే….కొంతకాలం సింఘాల్‌నే కొనసాగించాని జగన్‌ నిర్ణయం తీసుకోవడంతో అందరూ ప్రయత్నాలను విరమించుకున్నారు.

ఇప్పుడు….ఈ ఏడాది గడువు కూడా ముగిసింది. ఆయనకే పొడగింపు ఇచ్చేట్లుంటే ఇప్పటికే ఉత్తర్వులు వెలువడేవి. అటువంటి ఉత్తర్వులేవీ ఇప్పటిదాకా రాలేదు. అంటే…ఆయన్ను బదిలీ చేయడానికే ప్రభుత్వం నిర్ణయిం చుకుని ఉండొచ్చని చెబుతున్నారు.

ఈ పదవి కోసం ప్రస్తుతం జగన్‌కు సన్నిహితంగా ఉంటూ ఆరోగ్యశాఖలో పనిచేస్తూ, కోవిడ్‌ విపత్తు వేళ సమర్థవంతంగా వ్యవహరిస్తున్న జవహర్‌ రెడ్డి వంటి వారు గతంలోనే ప్రయత్నించారు. అప్పట్లో దేవాదాయ శాఖలో ఉన్న జెఎస్‌వి ప్రసాద్‌ పేరు కూడా వినిపించింది. ఇంకా చాలా మందే టిటిడి ఈవో పోస్టుపై ఆశలు పెట్టుకున్నారు.

ఈ నేపథ్యంలో టిటిడి ఈవోగా సింఘాలే కొనసాగుతారా లేక బదిలీ అవుతారా, అయితే ఆ పోస్టులోకి ఎవరు వస్తారనేది సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది.
– ధర్మచక్రం ప్రతినిధి, తిరుపతి

1 Comment

  1. శ్రీవారి కొలువులో సింఘాల్‌ సేవలు ముగిసే సమయం ఆసన్నమైందనిపిస్తోంది….!??

Leave a Reply

Your email address will not be published.


*