టిటిడి ఉద్యోగులకు ముఖ్యమైన వార్త…

టిటిడి ఉద్యోగుల వార్షిక క్రీడాపోటీలు ఫిబ్రవరి 2 నుండి 17వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఇందుకోసం ఉద్యోగులు జనవరి 28వ తేదీలోపు టిటిడి సంక్షేమ విభాగంలో తమ పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
పురుషులకు, మహిళలకు వేరువేరుగా పోటీలు నిర్వహిస్తారు. ఇందులో బాల్‌ బ్యాడ్మింటన్‌, షటిల్‌, టెన్నికాయిట్‌, క్యారమ్స్‌, చెస్‌, త్రోబాల్‌, డాడ్జి బాల్‌, కబడ్డీ, పాసింగ్‌ ది లగేజి, పరుగు, నడక పోటీలు, షాట్‌పుట్‌, బాల్‌త్రో, లెమన్‌స్పూన్‌, బకెట్‌ ఇన్‌ ది బాల్‌, హిట్టింగ్‌ ది ఇండియన్‌ క్లబ్స్‌ తదితర క్రీడలు ఉన్నాయి. 40 ఏళ్లలోపు, 40 ఏళ్ల నుండి 50 ఏళ్ల లోపు, 50 ఏళ్లు పైన విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారు. ఉద్యోగులకు, ఉద్యోగుల కుటుంబ సభ్యులకు, విశ్రాంత ఉద్యోగులకు క్రీడాపోటీలు జరుగుతాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*