టిటిడి ఉద్యోగుల వైద్యం గురించి సిఎంఓతో చర్చలు..!

టీటీడీ ఉద్యోగ సంఘాల నేతలు‌ టిటిడి చీఫ్ మెడికల్ ఆఫీసర్ ని కలసి చర్చించారు. సెంట్రల్ హాస్పిటల్ నందు కరోనా నేపథ్యంలో అవసరమైన మందులు, ట్రీట్మెంట్ కు సంబంధిచిన విషయాలు, తీసుకోవలసిన జాగ్రతలు గురించి మాట్లాడారు.


టీటీడీ ఉద్యోగులకు, పెన్షనర్లకు అవసరమైన షుగర్ బిపి డైలాసిస్ ఇతరత్రా నెల వారి మందులు లేక ఇబ్బందులు గురవుతున్నారని తెలియజేశాారు. లాక్ డౌన్ కారణం గా రవాణాలో ఇబ్బందుల వలన కొరత వచ్చిందని, రేపటి నుండి నెల వారి మందులు ఇస్తామని, ఇంకా కొన్ని ఢిల్లీ నుంచి రావలసింది వుందని నెలసరి మందులు ఇస్తామని తెలియ చేసారు.

సెంట్రల్ హాస్పిటల్ నందు ఓపి ప్రారంభం చెయ్యాలనిి, అదే విధంగా షుగర్ బీపీ లు చెక్ చెయ్యాలని ఇతరత్ర అవసరాలు కూడా చూడాలని కోరము బీపీ షుగర్ లు చెక్ చెయ్యడానికి ప్రత్యేక కౌంటర్ పెట్టమని ఓపి లు ఉదయం 8.00 గంటల నుండి 12.00 వరకు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వరుస క్రమంలో చూస్తామని, అత్యవసర పరిస్థితులులో తప్ప 60 ఏళ్ళు పై బడిన వారిని, 10 ఏళ్ళు చిన్న పిల్లలును తీసుకొని రావద్దని, నెల వారి మందులకు కుటుంబ సభ్యులు వచ్చి తీసుకొని వెళ్ళవచ్చునని, వయస్సు పైబడిన వారితో తప్పనిసరిగా కుటుంబ సభ్యులువచ్చి చూపించుకుని వెంటనే వెళ్లిపోవాలని సిఎంఓ కోరారు.

భవిష్యత్తులో నగదు రహిత వైద్యం ఫైల్ ను త్వరిత గతంగా పరిష్కారం చెయ్యాలని స్విమ్స్ రెఫరల్ కు ఇబ్బందులు లేకుండా డేటా మొత్తం స్విమ్స్ టీటీడీ హాస్పిటల్ సమన్వయము చేసుకోవాలని కోరడం జరిగింది.
ఈకార్యక్రమంలో టీటీడీ జెఏసి నాయకులు గోల్కొండ వెంకటేశం, వెంకటరమణ రెడ్డి, నాగార్జున, కల్పనా, భాస్కర్, వి. వెంకటరమణ, కాటా గుణశేఖర్ ఇందిరా పాల్గొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*