టిటిడి ఉద్యోగుల సమైక్య నాదం

తమ సమస్యల పరిష్కారం కోసం టిటిడి ఉద్యోగులు సమైక్యంగా గళం వినిపించారు. టిటిడిలోని అన్ని యూనియన్ల నాయకులు‌ ఏకమై పరిపాలనా భవనం వద్ద సమావేశమయ్యారు. ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, మెడికల్ పాలసీ రూపొందించాలని, సలహా మండళ్లకు పాలనా అధికారాలను రద్దు చేయాలని, టిటిడి ఉద్యోగుల సర్వీసు రూల్స్ ను సవరించి సర్వీసులో కనీసం ఒక ప్రమోషన్ ఇవ్వాలని, ఖాళీ పోస్టులు భర్తీలు భర్తీ చేయాలని, ఉద్యోగ సంఘ ఎన్నికలు నిర్వహించాలని, ఉద్యోగులకు 300 దర్శనం టికెట్లు మంజూరు చేయాలని, కాంట్రాక్టు కార్మికులకు కార్మిక చట్టాలు అమలు చేయాలని తదితర డిమాండ్లపై చర్చించారు.

దీర్ఘ కాలంగా ఉన్న ఈ సమస్యలను‌ టిటిడి యాజమాన్యం పట్టించుకోవడం లేదు. ఉద్యోగ సంఘాలు ఎప్పటికి అప్పుడు అడుగుతున్నా అధికారులు ఖాతరు చేయడం లేదు. ఇది ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తికి కారణమయింది. దీంతో సంఘాల నాయకులు తమ మధ్య ఉన్న చిన్నపాటి విభేదాలను పక్కనపెట్టి అందరూ ఏకమయ్యారు. సమస్యల పరిష్కారానికి చేపట్టాల్సిన కార్యాచరణ పై సోమవారం సాయంత్రం జరిగిన సమావేశంలో చర్చించారు.

వందల మంది ఉద్యోగులు హాజరైన ఈ సమావేశంలో మాట్లాడిన నాయకులంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల వద్దకే కాకుండా ప్రభుత్వం దృష్టికీ సమస్య లను తీసుకెళ్లాలని నిర్ణయించారు.‌ నిర్ణీత సమయం ఇచ్చి అప్పటికీ సమస్యలు పరిష్కారం కాకుంటే ఆందోళనకు దిగాలని నిర్ణయించారు.

ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతలు నాగార్జున, వెంకటేశం, దాసు, ప్రసాదరావు, చీర్ల కిరణ్, లక్ష్మీనరాయణ యాదవ్, వెంకట్రమణారెడ్డి, మహీధర్ రెడ్డి, వాసు, ప్రసాదరావు, సుబ్రమణ్యం, కెవి రమణ‌, మునిరాజ, రవి కుమార్, త్యాగరాజు, ఇందిర తదితరులు పాల్గొన్నారు.

1 Comment

Leave a Reply

Your email address will not be published.


*