టిటిడి ఎంప్లాయిస్ బ్యాంకు అధ్యక్షునిగా ముని వెంకట రెడ్డి, ఉపాధ్యక్షులుగా శివకుమార్

టీటీడీ ఎంప్లాయిస్ బ్యాంక్ అధ్యక్షుడిగా అమ్మ టి ముని వెంకటరెడ్డి, ఉపాధ్యక్షుడిగా చింతల శివకుమార్, కోశాధికారిగా అడసలపల్లి వాసు ఎన్నికయ్యారు. ఈ నెల 19 తారీకు జరిగిన ఎన్నికల్లో ఏడుగురు డైరెక్టర్లుగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ ఏడుగురు నుంచి అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కోశాధికారి ని ఎన్నుకోవడం కోసం శనివారం ఉదయం ఎన్నికల అధికారి బ్రహ్మానంద రెడ్డి నామినేషన్లు స్వీకరించారు. అధ్యక్షునిగా ముని వెంకటరెడ్డి, ఉపాధ్యక్షునిగా శివ కుమార్, కోశాధికారిగా వాసు నామినేషన్లు దాఖలు చేశారు. వీరికి చీరల కిరణ్, బచ్చల హేమలత మద్దతు తెలియజేశారు.

అమ్మిటి ముని వెంకటరెడ్డి, అధ్యక్షులు

ఈ ఎన్నికపై మొన్నటినుంచి టీటీడీ ఉద్యోగుల్లో ఆసక్తి నెలకొంది. డైరెక్టర్ గా ఎన్నికైన ఏడుగురిలో గోల్కొండ వెంకటేశం, గుణశేఖర్ మినహా మిగతా ఐదుగురు ఒకటిగా ఏర్పడి, తమలో తాము సర్దుబాటు చేసుకొని ఎన్నిక ఏకగ్రీవం అయ్యేలా చూసుకున్నారు. ఇదిలా ఉండగా మొదటి ఒకటిన్నర సంవత్సరం ముని వెంకటరెడ్డి, ఆ తరువాత ఓ ఒకటిన్నర సంవత్సరం శివ కుమార్, చివరి రెండు సంవత్సరాలు చీరల కిరణ్ బ్యాంకు అధ్యక్షులుగా ఉండేలా ఒప్పందం కుదిరినట్లు చెబుతున్నారు.

చింతల శివకుమార్, ఉపాధ్యక్షులు

ఇదిలా ఉండగా అధ్యక్ష, ఉపాధ్యక్ష, కోశాధికారిగా ఎన్నికైన ముగ్గురిని టిటిడి ఉద్యోగులు, బంధుమిత్రులు అభినందించారు. పూలమాలలు వేసి సత్కరించారు.

అడసలపల్లి వాసు, కోశాధికారి

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*