టిటిడి రవాణా

తిరుమలలో మంగళవారం సాయంత్రం బ్యాటరీ బస్సును టిటిడి ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. టిటిడి రవాణా విభాగం కార్యాలయంలో జనరల్‌ మేనేజర్‌ శ్రీ శేషారెడ్డి జెండా ఊపి బస్సును ప్రారంభించారు. ముందుగా బస్సుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రశేషారెడ్డి మీడియాతో మాట్లాడుతూ తిరుమలను కాలుష్యరహితంగా తీర్చిదిద్దడంలో భాగంగా టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, జెఈవో  కె.ఎస్‌.శ్రీనివాసరాజు ఆదేశాల మేరకు బ్యాటరీ బస్సు పనితీరును పరిశీలిస్తున్నట్టు చెప్పారు. హైదరాబాద్‌కు చెందిన గోల్డ్‌స్టోన్‌ సంస్థ ఈ బస్సును రూపొందించిందన్నారు. తిరుమలలో ఉచిత బస్సుల తరహాలో వారం రోజుల పాటు ఈ బస్సును నడుపుతామని, పనితీరును పరిశీలించి ఉన్నతాధికారులు తగిన నిర్ణయం తీసుకుంటారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌టిసి డిపో మేనేజర్‌  కెఎల్‌ఎన్‌.రెడ్డి, టిటిడి డిఐ  భాస్కర్‌ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*