టిటిడి వైద్య శిబిరంలో 1345 మందికి సేవలు..!

టిటిడి ఉద్యోగులకు వారి కుటుంబ సభ్యులకు, విశ్రాంత ఉద్యోగులకు వివిధ సంస్థ‌ల సహకారంతో నిర్వ‌హించిన ఉచిత మెగా వైద్య శిబిరంకు ఉద్యోగుల నుండి విశేష స్పంద‌న వ‌చ్చిన‌ట్లు టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ బి.ల‌క్ష్మీకాంతం తెలిపారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనం ప్రాంగణంలో గల కేంద్రీయ వైద్యశాలలో జూన్ 1, 2వ తేదీల్లో నిర్వహించిన వైద్య శిబిరంలో 1345 మందికి వైద్య సేవలు అందించినట్లు ఆదివారం సాయంత్రం ఆయన వెల్లడించారు.
ఈ సంద‌ర్భంగా జెఈవో మాట్లాడుతూ కేంద్రీయ వైద్యశాల, అశ్విని వైద్యశాల, ఎస్వీ ఆయుర్వేద వైద్యశాల, స్విమ్స్‌, బిల్రోత్‌, ఎంఎస్‌డి, ఎస్‌ఆర్‌ ఎల్‌ ఆస్పత్రుల స‌హాకారంతో నిర్వ‌హించిన‌ట్లు తెలిపారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ వైద్య శిబిరంలో బ్లడ్‌షుగర్‌, బిపి, అల్ట్రాసౌండ్‌, షుగర్‌ వ్యాధులు, స్త్రీల సంబంధిత వ్యాధులు, క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించి పరీక్షలు, తదితర వైద్యసేవలు అందించిన్నట్లు తెలిపారు.
అనంత‌రం స్విమ్స్‌ సంచాలకులు డా|| రవికుమార్ మాట్లాడుతూ టిటిడి ఉద్యోగులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే భక్తులకు సేవలందించగలరని అన్నారు. ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు, విశ్రాంత ఉద్యోగులకు వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన‌ట్లు తెలిపారు.
ఈ సందర్భంగా జెఈవో టిటిడిలోని అన్ని విభాగాల అధికారులకు మెమొంటోలు అందించారు.
ఈ కార్య‌క్ర‌మంలో సిఎమ్‌వో డా|| నాగేశ్వరరావు, బర్డ్‌ ఇన్‌చార్జ్‌ డైరెక్టర్‌ డా|| వెంకారెడ్డి, ఎస్‌ఎంవో డా|| ఆర్వీఎస్‌.మురళీధర్‌, సూప‌రెండెంటెంట్ డా|| కుసుమ‌కుమారి, ఇతర అధికారులు, పారా మెడికల్‌ సిబ్బంది, పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.

———————————————
1345 EMPLOYEES AND KIN UTILIZE THE MEDICAL CAMP – TIRUPATI JEO

Tirupati, 2 Jun. 19: In an innovative move, the two-day mega free medical camp organised by TTD with the co assistance from SVIMS, Beltroth, SRL hospital in the compound of TTD Central Hospital was a huge hit among the employees and their families.

Tirupati JEO Sri B Lakshmikantham personally monitored the arrangements for the first ever mega free medical camp. Speaking on Sunday evening, the JEO said, the motto behind this free mega medical camp is to ensure the well-being of our employees and their kin. Only if an employee is healthy, he or she could offer better services to pilgrims with more effectiveness and enthusiasm, th JEO opined.

He said, the Pink bus brought from SVIMS provided medical examination exclusively to women employees. The specialist examination for cervical, oral, breast cancer were carried out to over 175 women in these two days.

Following the reports, we are contemplating the diet plan and health tips to those who diagnosed with abnormality. I thanks the SVIMS Director Dr Ravi Kumar, CMO Dr Nageswara Rao and their team of doctors, para medical staff for their dedication in carrying out the free mega medical camp in a successful manner”, he maintained.

Later SVIMS Director Dr Ravi Kumar said, the aim is to engage more number of employees and their kin to utilize the free mega medical camp and later empower or create awareness among them on healthy way of life and finally to eliminate the diseases with which they are diagnosed if any.

Expressing their opinion some women employees and their mothers shared that this camp is of great use and need to be organised on a regular basis. “We hardly have time to have all tests if we go to hospital. But because of this camp we could able to undergo all of them at one place especially those related to women”, they said.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*