టిడిపితో అమీతుమీకి మెగా ఫ్యామిలీ రెడీ!

జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ తన ప్రధాన ప్రత్యర్థి ఎవరో ఒక నిర్ణయానికి వచ్చినట్లున్నారు. గత ఎన్నికల్లో తాను అధికారంలోకి తెచ్చిన తెలుగుదేశం పార్టీనే ఇప్పుడు ఆయన ప్రధాన శత్రువుగా మారింది. తాజాగా జరిగిన పరిణామాలు పవన్‌కు చాలా స్పష్టత తీసుకొస్తున్నాయి. రాజకీయాలకు కొత్తయిన పవన్‌ కల్యాణ్‌…ఇక్కడ జరుగుతున్న వ్యవహారాలను చూసి ఒక విధంగా ఖిన్నుడైనట్లు కూడా అర్థమవుతోంది.

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌ వర్మ సలహా మేరకు శ్రీరెడ్డి పవన్‌పై చేసిన వ్యాఖ్యలు…రాజకీయ దుమారంగా మారాయి. శ్రీరెడ్డి ఆ వ్యాఖ్యలు చేయడానికి తానే కారమణమి వర్మ అంగీకరించినప్పటికీ….పనవ్‌ మరో సంచలన కోణాన్ని బయటపెట్టారు. అమరావతి కేంద్రంగా….ముఖ్యమంత్రి తనయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ తనపై కుట్రలు చేస్తున్నాడని పవన్‌ ట్విట్టర్‌ ద్వారా చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. దర్శకుడు వర్మ, ఒక టివి ఛానల్‌తో కలిసి లోకేష్‌ తనపై బురదజల్లు తున్నారని, ఇందుకోసం శ్రీరెడ్డిని ఉపయోగించుకున్నారన్నది పవన్‌ ఆరోపణ. గత ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణమైన చేతిని చంపేయడానికి సిద్ధమయ్యారని పవన్‌ తీవ్రమైన ఆవేదనతో వ్యాఖ్యానించారు.

ఈ క్రమంలోనే….పవన్‌ సహా మెగా ఫ్యామిలీ అంతా (ఈ వార్త రాసే సమయానికి చిరంజీవి రాలేదు) ఫిలం ఛాంబర్‌క చేరుకుంది. తనను దూషించే శ్రీరెడ్డిని ప్రేరేపించిన దర్శకుడు వర్మపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌తో ఉదయం నుంచి ఛాబర్‌లోనే కూర్చున్నారు. సినీ ప్రముఖులందరీ ఛాంబర్‌కు రావాల్సిందిగా పవన్‌ పిలుపునిచ్చారు. అందరూ వస్తున్నారు. పవన్‌కు మద్దతు ప్రకటిస్తున్నారు. ఇది పైకి వర్మపై చర్య కోసం అనేవిధంగా ఉన్నప్పటికీ….వర్మ వెనుక ఉన్న వ్యక్తులను…అంటే టిడిపి నేతలను బయటకు లాగాలన్న లక్ష్యం కనిపిస్తోంది. వర్మ బయటకు వస్తే….తెలుగుదేశం నాయకులూ వస్తారన్నది పవన్‌ భావిస్తుండొచ్చు. మొదట్లో వర్మ వెనుక వైసిపి ఉందని ప్రచారం జరిగినా….పవన్‌ తకున్న విశ్వసనీయ సమాచారంతో….కుట్రకు ప్రధాన కారకుడు లోకేష్‌ అని ప్రకటించారు.

తెలుగుదేశం నాయకులంతా ధర్మదీక్ష పోరాటంలో ఉన్నారు. పవన్‌ ఆరోపణలపై ఇప్పటిదాకా స్పందించలేదు. రాత్రి 7 గంటలకు దీక్ష ముగిసిన తరువాత టిడిపి నాయకులు దీనిపైన స్పందించే అవకాశాలున్నాయి. అప్పుడు ఇంకొన్ని విషయాలు బయటకు వస్తాయి. ఏమైనా టిడిపినే తన ప్రధాన శత్రువు అని ఈ రోజు పవన్‌ సహా మెగా కుటుంబమంతా ఒక నిర్ణయానికి వచ్చినట్లుంది. టిడిపితో అమీతుమీ తేల్చుకోడానికి మెగా ఫ్యామిలీ సిద్ధమైనట్లే భావించాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*