టీటీడీ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులుకు ఉద్యోగ భద్రత!

  • టిటిడి కీలక నిర్ణయం
  • ప్రభుత్వ అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్లోకి టిటిడి కార్మికులు

టీటీడీ లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని టిటిడి పాలక మండలి సమావేశంలో నిర్ణయించినట్లు చైర్మన్ వై వి సుబ్బారెడ్డి చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన అవుట్సోర్సింగ్ కార్పొరేషన్లో టిటిడి కార్మికులందరినీ చేర్చడం ద్వారా ఉద్యోగ భద్రత లభిస్తుందని తెలిపారు. టీటీడీలో 14 వేల మందికిపైగా ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. వీరంతా పలువురు లేబర్ కాంట్రాక్టర్ల కింద విధులు నిర్వహిస్తున్నారు. కాంట్రాక్టర్లు మారినప్పుడల్లా కార్మికులను తొలగించడం, ఇష్టానుసారం బదిలీ చేయడం, వేతనాలు సరిగా చెల్లించక పోవడం, వంటివి జరుగుతున్నాయి. దీనిపైన కార్మికులు చాలా కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు‌. గతంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కోసం జిల్లాకు వచ్చిన సందర్భంగా టీటీడీ అవుట్ సోర్సింగ్ కార్మికులు ఆయన కలిసి సమస్య వివరించారు. అదేవిధంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ , అవుట్సోర్సింగ్ కార్మికుల విషయంలోనూ ఇదే సమస్య ఉండడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లేబర్ కాంట్రాక్టర్లను తొలగించి, అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు, చేసి దాని ద్వారానే రాష్ట్ర వ్యాప్తంగా అవుట్ సోర్సింగ్ కార్మికులకు వేతనాలు చెల్లించాలని నిర్ణయించింది‌. ఈ మేరకు కార్పొరేషన్ కూడా ఏర్పాటయింది అయింది. ఈ క్రమంలో టీటీడీలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ కాంట్రాక్టు కార్మికులను కూడా రాష్ట్ర కార్పొరేషన్లో చేర్చాలని టిటిడి పాలక మండలి నిర్ణయించింది. దీనివల్ల ఉద్యోగులకు భద్రత ఏర్పడుతుంది.

  • ధర్మచక్రం ప్రతినిధి, తిరుమల

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*