టీటీడీ పై సుబ్రమణ్యస్వామి పిటిషన్ సిద్ధం!

తిరుమల తిరుపతి దేవస్థానంపై ప్రభుత్వ పెత్తనం, శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు తొలగింపు వ్యవహారాలపై సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేయడానికి సిద్ధమైన బిజెపి ఎంపీ, సీనియర్ న్యాయవాది పిటిషన్ డ్రాఫ్టింగ్ పూర్తిచేసినట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈవేసవిలో టిటిడీ కి సంబంధించిన రిట్ పిటిషన్ తయారుచేయడం పూర్తయిందని వెల్లడించారు. దాదాపు నెల క్రితం తన బృందంతో కలిసి పిటిషన్ తయారు చేస్తున్నట్లు ఫోటోతో సహా ట్విట్టర్ లో పెట్టారు. మళ్లీ ఈ నెల 21 వ తేదీన మరో పోస్టు చేస్తూ పిటిషన్ తయారుచేయడం పూర్తయిందని తెలియజేశారు.

ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు టీటీడీ పై ఆరోపణలు, విమర్శలు చేసి నేపథ్యంలో ఆయన రాత్రికి రాత్రి ప్రధానార్చక పదవి నుంచి తొలగించారు. శ్రీవారి ఆలయంలో కైంకర్యాలు సరిగా జరగడం లేదని, పోటులో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపారని ఆరోపిస్తున్న రమణ దీక్షితులు వీటిపై సిబిఐ విచారణ జరిపించాలని కోరుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న వ్యవహారాలపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తానని సుబ్రమణ్యస్వామి ప్రకటించారు. టిటిడిపై పిటిషన్ వేయడం అంటే సమగ్ర వివరాలతో వేయాలి. దీనికి సంబంధించిన అనేక చట్టాలను, కోర్టు తీర్పులను అధ్యయనం చేయాలి. అదేవిధంగా సంప్రదాయాలు, మతవిశ్వాసాలను పరిగణలోకి తీసుకోవాలి. అందుకే సుబ్రహ్మణ్యస్వామి తన న్యాయ బృందంతో కసరత్తు చేసి సమగ్రంగా రిట్ పిటిషన్ తయారు చేసినట్లు తెలుస్తోంది. ఈ రిట్ పిటిషన్ పైనే రమణ దీక్షితులు ఆశలు పెట్టుకున్నారు. కోర్టు జోక్యంతో తాను మళ్లీ ప్రధానార్చక పదవిలో నియమితులవడం ఖాయమన్న ధీమాతో ఉన్నారు.

న్యాయస్థానం రమణ దీక్షితులు ను తిరిగి ప్రధాన అర్చకులుగా నియమించాలని ఆదేశాలిస్తే వెంటనే అమలు చేయడానికి టిటిడి సిద్ధంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా రమణ దీక్షితులు వివాదాన్ని పొడిగించ కూడదన్న అభిప్రాయంలో ఉంది. ఎందుకంటే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ సామాజిక వర్గానికి వ్యతిరేకంగా భావన సర్వత్రా ప్రచారం జరిగింది. అందుకే నష్టనివారణ చర్యలకు ఉపక్రమించింది.

ట్విట్టర్ లో సుబ్రమణ్య స్వామి పోస్టు

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*