డిప్లొమా ఇన్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌, క్యాటరింగ్‌ టెక్నాలజి, ఫార్మసీ కోర్సులలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

టిటిడి ఆధ్వర్యంలో తిరుపతిలో నడుస్తున్న శ్రీ పద్మావతి మహిళా పాలిటెక్నిక్‌ కళాశాలలో 2018-19వ విద్యాసంవత్సరానికి గాను మూడు సంవత్సరాల వ్యవధి గల డిప్లొమా ఇన్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ మరియు క్యాటరింగ్‌ టెక్నాలజీ, రెండు సంవత్సరాల వ్యవధి గల డిప్లొమా ఇన్‌ ఫార్మసీ కోర్సులో ప్రవేశానికి అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు అహ్వానిస్తున్నారు.

డిప్లొమా ఇన్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ మరియు క్యాటరింగ్‌ టెక్నాలజీ కోర్సులో ప్రవేశానికి ఇంటర్మీడియట్‌ లేదా తత్సమానమైన కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. అదేవిధంగా డిప్లొమా ఇన్‌ ఫార్మసీ కోర్సులో ప్రవేశానికి ఇంటర్మీడియట్‌ బైపిసి మరియు ఎమ్‌పిసి విద్యార్థినిలు మాత్రమే అర్హులు. మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. వీరికి ఎటువంటి వయోపరిమితి లేదు.

ఆసక్తి గల అభ్యర్థుల నుంచి జులై 5వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. జూలై 12వ తేదీ కౌన్సెలింగ్‌ జరుగనుంది. కోర్సులో చేరిన వారికి ఉచిత హాస్టల్‌ మరియు భోజన సౌకర్యం కల్పిస్తారు. మరింత సమాచారం కొరకు వెబ్‌సైట్‌ http://www.dteap.nic.in ( …è^¥) http://www.sbtetap.gov.in చూడగలరు.

ఇతర వివరాలకు కళాశాల ప్రిన్సిపాల్‌ను 0877-2264603, డిప్లొమా ఇన్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ మరియు క్యాటరింగ్‌ టెక్నాలజీ కోర్సుకు సంబంధించి 9948350188, 8985332244, డిప్లొమా ఇన్‌ ఫార్మసీ కోర్సుకు సంబంధించి 9299008151 నంబరులో కార్యాలయం వేళల్లో సంప్రదించగలరు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*