ఢిల్లీ సిఎం కేజీవ్రాల్‌ కంటే…స్కూల్‌ పిల్లలే నయం!

బిజెపి, కాంగ్రెస్‌లను సవాల్‌ చేస్తూ ఢిల్లీ పీఠాన్ని చేజిక్కించుకున్న సాధారణ వ్యక్తిగా ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత కేజీవ్రాల్‌ దేశంలో సంచలనం సృషించారు. ఢిల్లీకి ముఖ్యమంత్రి అయినా సాదాసీదాగా ఉంటారంటూ సామాజిక మాధ్యమాల్లో ఆయనపై ప్రశంసల జల్లు కురుస్తుంటుంది. అయితే…ఆమ్‌ఆద్మీ రెబల్‌ ఎంఎల్‌ఏ కపిల్‌ మిశ్రా …..కేజ్రీవాల్‌ కంటే స్కూల్‌ పిల్లలే నయం అనే విధంగా మాట్లాడుతున్నారు. స్కూల్‌ పిల్లలు ఏదో ఒక సాకుతో తరగతులకు ఎగ్గొట్టడానికి ప్రయత్నిస్తుంటారు. కేజ్రీవాల్‌ కూడా అసెంబ్లీకి ఎగ్గొడుతున్నారట. ఆయన చెబుతున్న గణాంకాలూ చాలా ఆశ్చర్యం కలిగించేలా ఉన్నాయి.

పట్టుమని పది నిమిషాలు కూడా ఆయన అసెంబ్లీలో లేరు. 2017 నుంచి ఇప్పటిదాకా 27 అసెంబ్లీ సెషన్స్‌ జరగ్గా.. ఏడింటికి మాత్రమే కేజ్రీవాల్‌ హాజరయ్యారు. ఈయనేం ముఖ్యమంత్రో అర్థం కావట్లేదు. ప్రజా సమస్యలపట్ల ఆయనకు ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమయ్యేందుకు ఇదే ఉదాహరణ. దయచేసి..కేజ్రీవాల్‌ అసెంబ్లీ రికార్డులను ఓసారి క్షుణ్ణంగా పరిశీలించండి. అంతేకాదు నియోజకవర్గాల్లో ఆయన ఎన్నిసార్లు పర్యటించారో.. ప్రజల దగ్గరి నుంచి ఎన్ని విజ్ఞప్తులు పరిశీలించారో ఆరా తీయండి. ఆయన ఆస్తుల వివరాలను కూడా ఓసారి పరిశీలించండి’ అని కపిల్‌ పిటిషన్‌లో న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌ను బెంచ్‌ అత్యవసరంగా స్వీకరించగా.. మంగళవారం విచారణకు రానుంది. మరోవైపు ఈ పిటిషన్‌పై ఆప్‌ మాత్రం గప్‌చుప్‌గా ఉంది.

బ‌హుశా ఇటువంటి పిటిష‌న్ కోర్టు ముందుకు రావ‌డం ఇదే తొలిసారి ఏమో. అంద‌రి ఎంఎల్ఏలు, ఎంపిల హాజ‌రు రికార్డుల‌ను ప‌రిశీలిస్తే…అంద‌రి బండారం బ‌య‌ట‌పడుతుంది. కేజ్రీవాల్ కేసుతోనైనా ఇలాంటి చ‌ర్చ జ‌ర‌గ‌డం మంచిదే. ప్ర‌జ‌లు ఓట్లేసి చ‌ట్ట‌స‌భ‌ల‌కు పంపిస్తే…అక్క‌డికి వెళ్లి చ‌ర్చ‌ల్లో పాల్గొనే ఓపిక లేని ప్ర‌జాప్ర‌తినిధులు చాలామందే ఉన్నారు. అలాంటి వాళ్లంద‌రి హాజ‌రు వివ‌రాల‌ను బ‌హిర్గం చేస్తే…వారిలో మార్పు వ‌స్తుందేమో!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*