తలలేని టీచర్లు…విద్యార్థుల తలకు అట్టపెట్టెలు..!

బండిని లాగే గుర్రం కళ్లకు గంతలు కడుతుంటారు. గంతలంటే పూర్తిగా కనిపించకుండా కాదు…పక్కచూపు కనిపించకుండా, నేరుచూపు చూడటానికి వీలుగా చిన్నమూతలు వంటి వాటిని కళ్లకు కడుతుంటారు. ఇదే తరహా ఆలోచన వచ్చింది ఆ ఘనత వహించిన ఆ కాలేజీ టీచర్లకు. విద్యార్థులు పరీక్షల్లో కాపీ కొట్టకుండా నివారించడం కోసం….తలలేని పని చేశారు. ఇంతకీ ఏం చేశారంటే…

కర్నాటక రాష్ట్రం హవేరీ పట్టణంలో భగత్‌ ఫ్రీ-యూనివర్సిటీ కాలేజీ ఉంది. అక్కడి విద్యార్థులకు మిడ్‌టర్మ్‌ పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షల్లో చూసిరాతలను నివారించే పేరుతో….ప్రతి విద్యార్థి తలకు ఒక అట్టపెట్టెను తగిలించారు. పెట్టె కొంచెం అటూ ఇటూ జరిగినా ఇన్విజిలేటర్‌ వచ్చి మందలించారట. ఒక విధంగా చెప్పాలంటే విద్యార్థులను జంతువులను చూసినట్లు చూశారు.

దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. వెంటనే విద్యాశాఖ అధికారులు స్పందించి అక్కడికి వెళ్లారు. దీంతో కాలేజీ నిర్వాహకులు విద్యార్థులకు తగిలించిన పెట్టెలను తొలగించారు. ఇకపై ఇటువంటివి పునరావృత్తమైతే కేసులు పెడతామని హెచ్చరించారు. దీనిపైన కర్నాకట విద్యాశాఖ మంత్రి కూడా స్పందించారు. కాలేజీ యాజమాన్య తీరును తీవ్రంగా తప్పుబట్టారు. సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*