తిండిబోదు…పనిదొంగ…మిస్టర్‌ అయోమయం : బిగ్‌బాస్‌ అవార్డులు, బిరుదులు

బిగ్‌బాస్‌ ఇంటి సభ్యులకు సరదా అవార్డులు ప్రకటించారు బిగ్‌బాస్‌. ఎలిమినేట్‌ అయిన సభ్యులందరీని శుక్రవారం నాడు ఇంటికిలోకి తీసుకొచ్చిన బిగ్‌బాస్‌…శనివారం ఓ సరదా కార్యక్రమంలో అవార్డులు ప్రకటించారు. ఇంటిలో సభ్యులు వ్యవహరించిన తీరు ఆధారంగా అ వార్డులు నిర్ణయించారు. చాలామటుకు సరిగానే ఇచ్చినా….కొన్ని అవార్డులు అసంబద్ధంగా అనిపించాయి.

ఎప్పుడూ నిద్రపోతుందని విమర్శలు ఎదుర్కొన్న దీప్తి సునయనకు…’బద్ధకం’, ‘నిద్రబోదు’ అవార్డులు ఇచ్చారు. తిండియావ ఎక్కువగా ఉండే గణేష్‌కు ‘తిండిబోతు’ టాగ్‌ లభించింది. పనివుంటే తప్పించుకుని తిరిగే రోల్‌రైడాను ‘పనిదొంగ’ అవార్డుతో సత్కరించారు. సామ్రాట్‌కు ‘మిస్టర్‌ రోమియో’ అవార్డు దక్కింది. సింగర్‌ అయిన గీతామాధురిని ‘గానకోకిల’ అవార్డు అందుకున్నారు. ఎప్పుడూ ఆగ్రహంగా ఉంటారంటూ విమర్శలు ఎదుర్కొన్న తనిష్‌ను ‘ఆవేశపరుడు’ బిరుదుతో సత్కరించారు. దీప్తి ‘కాకరకాయ’, ‘డ్రామా క్వీన్‌’ అవార్డులు కైవసం చేసుకున్నారు.

‘పక్కా మాస్‌’ అవార్డు అనూహ్యంగా శ్యామలకు లభించింది. అవార్డు పేరు చెప్పగానే ఇది రోల్‌ రైడాకు వస్తుందని అందరూ ఊహించారు. తేజస్వీని ‘బెస్ట్‌ ఎంటర్‌టైనర్‌’ అవార్డుతో అభినందించారు. పోరాట యోధుడుగా పేరుపొందిన కౌశల్‌కు ‘బాబా’ అవార్డు ఇచ్చారు. భానుశ్రీని ‘మిర్చి’ – మిరపకాయి అంటూ కితాబునిచ్చారు. సమయం దొరికినపుడల్లా కెమెరా ముందుకెళ్లి మాట్లాడే అమిత్‌కు ‘ఫుటేజ్‌ కింగ్‌’ బిరుదు ప్రదానం చేశారు. బాబు గోగినేవి విషయంలో జాగ్రత్త వహించి ‘సర్వజ్ఞాని’ అవార్డు అందజేశారు.

అసలు పొంతనలేని అవార్డు కిరీటీకి దక్కింది. ‘మిస్టర్‌ ఆయోమయం’ అవార్డును ఆయనకు అంటగట్టారు. వాస్తవంగా ఆయన హౌజ్‌లో ఉన్న మూడు వారాలూ అత్యంత పరిణతితో వ్యవహరించారు. ఆ అవార్డు ప్రకటించగానే అందరూ గణేష్‌కు ఇస్తారనుకున్నారు. అనూహ్యంగా కిరీటీ మెడలో వేశారు. ఈ అవార్డు తనకు ఇవ్వడాన్ని కిరీటి మనస్పూర్తిగా అంగీకరించకున్నా…చేసేది లేక బ్యాడ్జి మెడలో వేయించుకున్నారు.

ఈ అవార్డుల ప్రదానం తరువాత…రోల్‌రైడా మంచి ర్యాఫ్‌సాంగ్‌తో అదరగొట్టాడు. ఆపై బిగ్‌బాస్‌ కొన్ని మాస్‌ పాటలను ప్లే చేయడంతో ఇంటి సభ్యులంతా సంతోషంగా చిందులేశారు.

ఫైనలిస్టుల కోసం బిగ్‌బాస్‌ ఇంటికి తరలివచ్చిన సెలూన్‌…
ఆదివారం జరిగే ఫైనల్స్‌కు ఇంటిలోని ఐదుగురు సభ్యులను తయారు చేసేందుకు ఒక సెలూన్‌నే ఇంటిలోకి తెప్పించారు బిగ్‌బాస్‌. దేశంలోనే పేరుగాంచిన సెలూన్‌ సంస్థ…. సెలూన్‌లోని పరికరాలన్నీ తీసుకొచ్చి సభ్యుల హెయిర్‌ స్టయిల్‌ను అందంగా తీర్చిదిద్దారు. ఇన్ని రోజులు మాసిన గడ్డం, పీక్కుపోయిన జుత్తుతో ఉన్న సభ్యులను ఆకర్షణీయంగా సిద్దం చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*