తిరుపతిని తాకిన ఐటి దాడులు..! మాజీ ఎంఎల్ఏ ఆస్తులు సోదా..!!

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి వ్యక్తిగత కార్యదర్శిగా పని చేసిన శ్రీనివాసులు ఇంట్లో నిర్వహించిన ఐటి సోదాలు సంచలనమై, చర్చనీయాంశంగా ఉన్న తరుణంలోనే…తిరుపతిలో తెలుగుదేశం పార్టీకి చెందిన నేతల ఆస్తులపైనా ఆదాయ పన్ను శాఖ దాడులు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

తిరుపతి శ్రీనివాసపురంలో అలుమేలుమంగ శ్రీనివాసం అనే పేరుతో నిర్మాణం అవుతున్న భారీ అపార్టుమెంటు ఈ దాడులకు కేంద్రంగా ఉంది. రూ.30 కోట్ల అంచనాతో సాగుతున్న ఈ అపార్ట్‌మెంటును తిరుపతి రుయాసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా పని చేస్తున్న ఓ సాధారణ ఉద్యోగి చేపట్టినట్లు సమాచారం అందడంతో ఐటి అధికారులు దృష్టి సారించారు.

ఈ స్థలం తిరుపతి ఓ మాజీ ఎంఎల్ఏ పేరుతో ఉన్నట్లు సమాచారం. దీంతో ఈ అపార్ట్‌మెంట్ నిర్మాణం వెనుక…ఆ మాజీ ఎంఎల్ఏ ఉండొచ్చన్న అనుమా నాలున్నాయి. రుయా ఉద్యోగిని బినామీగా పెట్టి వ్యవహారం నడుపుతున్నారని అనుమానిస్తున్నారు. దీంతో ఆ మాజీ ప్రజాప్రతినిధిని అన్నీ తానై నడిపించే అల్లుడుకి చెందిన కార్యాలయాలు, ఇళ్లలోనూ సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది.

ఏదిఏమైనా తిరుపతిలో జరిగుతున్న ఐటి దాడులు కలకలం సృష్డిస్తున్నాయి. ఈ సోదాల్లో ఏం బయటిపడుతుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*