తిరుపతిలో ఆగస్టు 14 దాకా లాక్ డౌన్ పొడిగింపు…కొద్ది వెసులుబాటు.. !

  • ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు అన్ని దుకాణాలు అనుమతి

తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో లాక్ డౌన్ ను ఆగస్టు 14 దాకా పొడిగించారు. గతంలో ప్రకటించిన లాక్ డౌన్ గడువు 5వ తేదీతో ముగుస్తున్న నేపథ్యంలో… అధికారులు తాజా నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పటి దాకా ఉదయం 11 గంటల వరకే దుకాణాలకు, వాహనాల రాకపోకలకు‌ అనుమతి ఉండేది. ఇకపై మధ్యాహ్నం రెండు గంటల దాకా అనుమతి ఉంటుంది. మధ్యాహ్నం రెండు గంటల తరువాత… అత్యవసరమైతే తప్ప ఎవరూ బయట తిరగకూడదని కమిషనర్‌ గిరీష కోరారు. దుకాణాలు మధ్యాహ్నం 2 గంటల పైన తెరచివుంచితే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దుకాణం సీజ్ చేసి, ట్రేడ్ లైసెన్స్ రద్దు చేయడానికీ వెనుకాడబోమన్నారు. ఎవరైనా మధ్యాహ్నం 2 గంటలపైన దుకాణాలు తెరిచి వుంచితే నగరపాలక సంస్థ కాల్ సెంటర్ 0877-2256766 కి తెలియజేయాలని సూచించారు.

తిరుపతిలో తొమ్మిది చోట్ల కరోనా పరీక్షలు… ఆ కేంద్రాలు ఇవే…

  1. అర్బన్ హెల్త్ సెంటర్ బైరాగి పట్టెడ, మీసేవ వద్ద..
  2. అర్బన్ హెల్త్ సెంటర్ స్కాన్జర్స్ కాలనీ, చేపల మార్కెట్ ఎదురుగా…
  3. అర్బన్ హెల్త్ సెంటర్ సిమ్స్ హాస్పిటల్ సర్కిల్, నెహ్రూ నగర్…
  4. అర్బన్ హెల్త్ సెంటర్ పోస్టల్ కాలనీ, వాటర్ ట్యాంక్ దగ్గర, రేణిగుంట రోడ్డు…
  5. అర్బన్ హెల్త్ సెంటర్ ఆటోనగర్, రేణిగుంట రోడ్డు….
  6. అర్బన్ హెల్త్ సెంటర్ శివ జ్యోతి నగర్, అంబేద్కర్ విగ్రహం దగ్గర జీవకోన….
  7. హార్ట్ హెల్త్ సెంటర్ పంచముఖ ఆంజనేయ స్వామి గుడి దగ్గర, ప్రకాశం రోడ్డు…
  8. మున్సిపల్ హెల్త్ సెంటర్, ప్రకాశం రోడ్డు
  9. అర్బన్ హెల్త్ సెంటర్ ఎర్ర మిట్ట, లీలామహల్ రోడ్డు, తిరుపతి.

జలుబు, దగ్గు, జ్వరం ఉన్నట్లయితేనే కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తారని, కోవిడ్ లక్షణాలు లేకపోతే పరీక్షలకు రాకూడదని కమిషనర్ తెలియజేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*