తిరుపతిలో వివేకానందుని రథయాత్ర..!

స్వామి వివేకానంద అమెరికాలోని చికాగో నగరంలో జరిగిన సర్వమత మహాసభలో ప్రసంగించి 125 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా రామకృష్ణ మిషన్… స్వామి వివేకానంద రథయాత్రను నిర్వహిస్తోంది. రాయలసీమ ప్రాంతంలోని యువతతో ఆత్మవిశ్వాసాన్ని , ఆత్మ స్థైర్యాన్ని, నింపి వారిని ప్రగతిపథంలో నడిపించే లక్ష్యంతో సాగుతున్న ఈ రథం గురువారం నాడు తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విద్యాలయానికి వచ్చింది.

ఈ రథానికి ఇన్చార్జి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఉమా , రిజిస్టర్ ఏం.మమత, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు . ఈ సందర్భంగా అనుపమానంద మాట్లాడుతూ స్వామి వివేకానంద గొప్పతనం గురిమనచి, ఆయన పాటించిన, విలువలు సిద్ధాంతాల గురించి వివరించారు. ప్రతి విద్యార్థి వివేకానందుని బాటలో నడిస్తే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని సూచించారు. శుక్ర, శనివారాలలోనూ ఈ రథయాత్ర తిరుపతి ప్రాంతంలో కొనసాగుతుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*