తిరుపతిలో సోమవారం కూరగాయల మార్కెట్లకు సెలవు

  • అందుబాటులో మొబైల్ కూరగాయల మార్కెట్లు
  • కమిషనర్ గిరీషా

తిరుపతి నగరంలోని కూరగాయల మార్కెట్లకు రేపు అనగా సోమవారం (13.4.20) సెలవు ప్రకటించచడం జరిగిందని నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీ గిరీషా.పి.ఎస్.ఐ. ఏ.ఎస్.గారు తెలిపారు. ఆదివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కరోనా వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు నగరంలోని ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ మూసివేసి నగరంలోని ఎనిమిది ప్రాంతాల్లో కూరగాయల మార్కెట్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కూరగాయల మార్కెట్ కు 25వ తేదీ మాసాంతపు సెలవులు ఇవ్వడం జరిగేది. అయితే గత రెండు రోజులు క్రితం కురిసిన వర్షంతో పలు చోట్ల పందిల్లు పడిపోవడం, కూరగాయలు తడిసిపోయాయి. దీంతో పందిరిల పునరుద్ధరణ చేసుకోవడానికి వ్యాపారస్తుల కోరిక మేరకు రేపు అనగా సోమవారం (13.4.20) కూరగాయల మార్కెట్ కు సెలవు ప్రకటించడం జరిగింది. 25వ తేదీ యధావిధిగా కూరగాయల మార్కెట్ లు నిర్వహించబడుతాయి. కాగా మొబైల్ మార్కెట్లు యధావిధిగా మీ ప్రాంతాల్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. కావున ప్రజలందరు నగరపాలక సంస్థ కు సహకరించాలని కమిషనర్ కోరారు.

అత్యవసరం అయితే తప్ప ఇంటి నుండి ఎవరు బయటకు రావద్దండి. బయటకు వచ్చినప్పుడు ముఖానికి మాస్క్, కర్చీఫ్ కట్టుకుని రావలెను, సామాజిక దూరం పాటించాలని ప్రజలకు కమిషనర్ సూచించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*