తిరుపతి పోలీసు జిల్లాలో 100 మంది పోలీసులకు కరోనా..

కరోనా వ్యాప్తి నివారణకు తిరుపతి మునిసిపల్ సమావేశ మందిరంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా, తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి. రమేష్ రెడ్డి , తిరుపతి మునిసిపల్ కమీషనర్ పి.యస్. గిరిషా సమావేశమయ్యారు. ఈ సందర్బగా జిల్లా యస్.పి మాట్లాడుతూ జిల్లా లో కరోనా వ్యాప్తి నివారణకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నామన్నామని, గడిచిన మూడు వారాలుగా తిరుపతి అర్బన్ పోలీస్ జిల్లా పరిధిలో రోజుకు 50 నుంచి 70 వరకు కరోనా కేసులు నమోదవుతున్నాయని. అలాగే కరోనాతో ఒక ఇన్స్పెక్టర్, మరో హోంగార్డు మృతి చెందడం బాధాకరమని. ఇప్పటి వరకు జిల్లాలో పోలీస్ సిబంది 72 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని, వారితో పాటు మరో 40 మంది వరకు ఎపిఎస్పీ పోలీసు సిబ్బందికి కరోనా బారినపడ్డారని. జిల్లాలో రెండువేల మంది పోలీసులు ఉంటే వారిలో 100 మంది కరోనా బారినపడటం బాధాకరమని.

గతంలో శ్రీకాళహస్తిలో తీసుకున్న చర్యలతో అక్కడ కేసులు తగ్గాయని… అదే ఫార్ములాను తిరుపతి నగరంలో కూడా ఉపయోగించి కేసులు తగ్గేందుకు చర్యలు తీసుకుంటామని. ప్రజలు అనవసరంగా బయటికి వచ్చినా, గుమికూడినా కరోనా వ్యాప్తి వేగంగా జరుగుతోందని అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని. తిరుపతి నగరంలో మద్యం దుకాణాలను పూర్తిగా మూసివేస్తున్నామని. ఇందుకు అందరూ సహకరించాలని, ప్రతి మరణం విషాదమే, దానికి కారణం చిన్నపాటి అజాగ్రత వైరస్ ఎంత వేగంగా ప్రబలుతున్నాదో కొంతమంది గుర్తించడంలేదు వారివలన కరోనా మహమ్మారి తెలియకుండానే ప్రబలతున్నది, తిరుపతి అన్ని వ్యాపార సంస్థలు సహకరించి ప్రజల శ్రేయస్సు కన్నా వ్యాపారం ముఖ్యం కాదాని తెలిపిన వారికి దన్యవాదాలని కావున ప్రజలకు ముఖ్యమైన విజ్ఞప్తి, హెచ్చరిక. కారణం లేకుండా బయటకు ఎవరు రాకూడదు, తిరుపతి నగరాన్ని అన్ని నగరాలతో పోల్చలేము, భక్తులు , బయట వాళ్ళు వస్తుంటారు, వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళి కోవిడ్ వ్యాప్తి చేయకుండా వుండటానికే కటిన నిర్ణయాలు అమలు చేస్తున్నాము. తిరుపతి నగర పరిస్తితి పై ప్రతి రోజు 4,5 సార్లు కలెక్టర్ , కమీషనర్ వారితో చర్చిస్తున్నాము. అందుకే ఇక్కడ కూడా రేపటి నుండి ఆగష్టు 5 వరకు లాక్ డౌన్ అమలు చేయనున్నాము, అందరూ సహకరించాలి. ఉదయం 6 నుండి 11 గంటల వరకు నిత్యావసర వస్తువులు మరియు ఇతర వస్తువులు కొనుగోలు చేయుటకు అన్ని దుకాణములు తెరిచి ఉంటాయి 11 గంటలపైన ఉద్యోగస్తులు మినహా ప్రజలేవ్వరూ రోడ్లపై రాకూడని గత మే మాసంలో ఉన్న వాతావరణం తిరుపతిలో రావాలని ఆశిద్దాం అన్ని తెలియజేశారు.

.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*