తిరుపతి మీడియాకు ఇంతకన్నా అవమానం ఉంటుందా?

శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు ఈరోజు చెన్నైలో మీడియా సమావేశం నిర్వహించారు. టిటిడి పైన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తిరుమలలో శ్రీవారికి కంకర్యాలు సరిగా జరగడం లేదని విమర్శించారు. శ్రీవారి ఆభరణాల భద్రత పైన అనుమానాలు వ్యక్తం చేశారు. అభివృద్ధి పేరుతో పురాతన కట్టడాలు కూల్చివేస్తున్నారని ఆవేదన చెందారు. తిరుమల శ్రీవారి ఆలయం పురావస్తుశాఖ ఆదిలో ఉండాలని అభిప్రాయపడ్డారు. ఇన్ని కీలక అంశాల గురించి మాట్లాడాలని అనుకున్నప్పుడు తిరుపతులోనో తిరుమలలనో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయకుండా చెన్నై దాకా ఎందుకు వెళ్ళినట్లు? చెన్నైలో విలేకరుల సమావేశం పెట్టడం వెనక వాళ్లు చెప్పింది ఒకటే…తిరుపతిలో చెపితే సరిగా బయటి ప్రపంచానికి చేరదని, అందుకే చెన్నైలో నేషనల్ మీడియా ముందుకు వచ్చామని వివరించారు. తిరుపతి మీడియా పైన విశ్వాసం కోల్పోయిన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. టిటిడి లో జరిగే అవకతవకలు అక్రమాలు గురించి పత్రికల్లో టీవీ ఛానళ్లలో వార్తలు రావనన్న అభిప్రాయం సర్వత్రా ఉంది. దీనికి కారణం ఏమిటో మీడియా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందనిపిస్తోంది.

(తిరుమల, తిరుపతి లో పనిచేస్తున్న మీడియా సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ప్రత్యేక కథనం ఇంకో పోస్టులో…)

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*