తిరుప‌తినీ అమ‌రావ‌తిలో సృష్టిస్తారా? టిటిడి నిధుల‌ను త‌ర‌లిస్తారా?

అమ‌రావ‌తిలో రూ.150 కోట్ల‌తో శ్రీ‌వారి ఆల‌యాన్ని నిర్మించాల‌ని టిటిడి పాల‌క మండ‌లి ఇటీవ‌ల నిర్ణ‌యించింది. ఇది శ్రీ‌వారి మీద భ‌క్తికంటే…చంంద్ర‌బాబు మీద అనుక‌ర్తితోనే అనేది బ‌హిరంగ ర‌హ‌స్యం. టిటిడి ఎక్క‌డ‌బ‌డితే అక్క‌డ ఆల‌యాలు నిర్మించ‌డంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తున్నాయి. టిటిడి ఉద్యోగుల్లోనే అసంతృప్తి వ్య‌క్త‌మ‌వుతోంది. వాసిరెడ్డి వేణుగోపాల్ అనే సీనియ‌ర్ పాత్రికేయులు ఈ అంశంపై స్పందించారు. త‌న ఫేస్‌బుక్‌లా రాశారు. తిరుప‌తినీ అమ‌రావ‌తిలో సృష్టిస్తారా? అని నిల‌దీశారు.

అదేవిధంగా మారిరెడ్డి పురుషోత్తం రెడ్డి అనే నెటిజ‌న్ త‌న అభిప్రాయాన్ని ఫేస్‌బుక్‌లో పంచుకున్నారు. విలువైన అంశాల‌ను లేవ‌నెత్తారు. టిటిడి నిధుల మ‌ళ్లింపుపై అన్ని రాజ‌కీయ పార్టీలూ స్పందించాల‌ని కోరుతున్నారు. ఈ రెండు క‌థ‌నాల‌ను మీరూ చ‌ద‌వండి.
……………………………………………………………………..
తిరపతి వెంకన్నకు, తిరపతి వెంకన్న కేలండర్ ఫోటోకి తేడా వుండదా? కేలండర్ తరహా తిరపతి నమూనా ఆలయాన్ని అమరావతిలో ఏర్పాటు చేయడానికి 150కోట్ల రూపాయలు అవసరమా? ఆ నిధులను తిరపతి వెంకన్న హుండీ నుంచి వెచ్చించడం అవసరమా? స్థల పురాణం అని వుంటుంది. అదే ప్రత్యేక కేంద్రంలో ఒక దేవుడు, ఒక దేవత వెలియడానికి ఒక నేపథ్యం, ఒక ప్రాకృత్రిక నేపథ్యం, ఒక సామాజిక నేపథ్యం, సాంస్కృతిక నేపథ్యం, ఒక ఆధ్యాత్మిక నేపథ్యం వుంటాయి. నమూనా గుడి కట్టగానే అది ఆ నేపథ్యాలకు ప్రాతినిధ్యం వహించదు. కేవలం గోడల గుడి అవుతుంది. తిరపతి గుడి నిర్మాణం ఎలా వుంటుందో తెలుసుకోవడానికి మాత్రమే తోడ్పడుతుంది తప్ప… భక్తుల విశ్వాసాలకు ప్రాతినిధ్యం వహించదు. గుండు కొట్టించుకోవడానికి తిరపతి పోతారే తప్ప అమరావతి పోరు. దేవుడితో ఇలా చెలగాటమాడడం, దైవ భక్తులతో ఇలా చెలగాటమాడడం తగనిపని. దానికోసం దేవస్థానం నిధులను, పూర్తిగా భక్తుల నిధులను.. 150కోట్లను వెచ్చించడం పూర్తిగా తగనిపని. కొందరు రాయలసీమ మిత్రులు న్యాయబద్ధమైన ప్రశ్న వేశారు.

మా తిరపతి వెంకన్న మా ఊర్లో ఉన్నాడు. మా దేవుడు. అందరి దేవుడు. కానీ తిరపతి వెంకన్న డబ్బులను అన్ని చోట్లా ఖర్చు చేస్తున్నారు. కల్యాణ మండపాలు కడుతున్నారు. నమూనా దేవాలయాలు కడుతున్నారు. కానీ.. ఒక బెజవాడ కనక దుర్గమ్మ ఆలయం నమూనాని ఎక్కడన్నా ఏర్పాటు చేశారా? దుర్గమ్మ ఆలయం నిధులతో మా ఊళ్లో ఒక కల్యాణ మండపం కట్టారా? సింహాచలం అప్పన్న చాలా సంపన్నుడు కదా? మాకు సింహాచలం రాకపోకలు చాలా వ్యయప్రయాసలతో పని. ఆ గుడి ఎలా వుంటుందో ఓ నమూనా ఆలయాన్ని మాకెప్పుడన్నా ప్రసాదించారా? అని రాయలసీమ మిత్రులు అడిగారు. చాలా న్యాయమైన ప్రశ్న. పాలకులు, ఆలయ పాలక మండళ్లు తప్పనిసరిగా జవాబు ఇవ్వాల్సిన ప్రశ్న. అయితే వ్యక్తిగతంగా నా సమాధానం… నమూనా దేవాలయాలకు నేను సంపూర్ణ వ్యతిరేకం. అది అమరావతిలో తిరపతి వెలిసినా, మరొకటి వెలిసినా నేను పూర్తి వ్యతిరేకం. వాటి గడప నేను తొక్కను. నేను దేవుడు వెలిసిన క్షేత్రాన్ని మాత్రమే గౌరవిస్తాను, పూజిస్తాను.
– Vasireddy Venugopal
……………………………………………………………………..
అర్దం లేని అమరావతి వాదానలను తిప్పి కొట్టాలి……
TTD అమరావతిలో 150 కోట్లు నిదులు వెచ్చించి నమూన ఆలయాన్ని నిర్మించాలని తీర్మాణించడాన్ని బాద్యతగల సంస్దలు, వ్యక్తులు అబ్యంతరం చెపుతున్నారు. TTD నిదులను స్వంత అవసరాలు, బక్తుల సౌకర్యాలుకే వెచ్చించాలని మిగిలిన వాటిని బక్తుల అవసరాలతో విడదీయరాని అనుబందం కలిగి, తరతరాలుగా శ్రీవారి ఆలయాన్ని కాపాడుకుంటున్న తిరుపతి అబివృద్దికే ఖర్చు చేయాలని రాయలసీమ ఉద్యమ సంస్దలు మొదటి నుండి కోరుతున్నాయి. TTD అవసరాల కోసం కొనుగోలు చేస్తున్న వ్యవసాయ ఉత్పత్తులను రాయలసీమ ప్రాంతం నుండి కొనుగోలు చేయాలని కూడా డిమాండు చేస్తున్నాయి. ఇలాంటి వాదను చేస్తున్న ప్రతి సందర్బంలో అమరావతి వాదులు చేస్తున్న వితండ వాదన 1. TTD కి దేశం మరియు ప్రపంచ వ్యాపితంగా ఉన్న బక్తులు కానుకలు ఇస్తున్నారు.

2. TTD హిందూదర్మాన్ని పరిరక్షించడానికి ముందుకు రావాలి నిదులు ఖర్చు చేయాలి.
రెండు వాదనలు వినడానికి బాగుంటాయి. వాస్తం ఏమిటి అన్నది పరిసీలించాలి. కేవలం TTD కి మాత్రమే ప్రపంచంలోని బక్తులు కానుకలు ఇస్తున్నారా ? ఉదా.. కేరళలో ఉన్న శబరమలై ఆలయానికి వెలుతున్న బక్తులు, వస్తున్న ఆదాయం బహుసా ఉబయ తెలుగు రాష్ట్రాల నుంచే ఎక్కువ ఉంటుంది. ఆ కారణం చెప్పి అక్కడి నిదులను మన రాష్ట్రంలో ఖర్చు చేయమని అడగగలమా ? కేరళ పక్క రాష్ట్రం మరి అమరావతిలో ఉన్న దుర్గగుడికి కేవలం ఆప్రాంతంలోని వారే కానుకలు వేస్తున్నరా ? మరి అక్కడి నిదులను మరో ప్రాంతంలో ఖర్చు చేయించే దైర్యం ప్రభుత్వానికి ఉందా ? TTD బోర్డులో విజయవాడ నుండి సభ్యులుగా నియమించినారు మరి దుర్గగుడి బోర్డులో తిరుపతికి చెందిన వారిని నియమించరెందుకు. ఎక్కడ లేని వాదనలు TTD కి మాత్రమే వర్తించడం అడిగేవారు లేరన్న దైర్యంతోనే.

హిందూమతం పరిరక్షణ అంటూ కొత్త వాదనులు తెస్తున్నారు. అంతే కాదు క్రైస్తవ సంస్దల కార్యక్రమాలను ఉదాహరణగా చూపుతున్నారు. ఆ సంస్దలు దేనిపైన ఖర్చు చేస్తున్నాయి. విద్యా, వైద్య సంస్దలపై శ్రద్ద పెడుతున్నాయి. మరి TTD నిదులు కూడా ఆ సంస్దలాగా తిరుపతిలో విద్యా, వైద్య సంస్దల కోసం వెచ్చించవచ్చు బర్డు చేస్తున్న సేవలు TTD ప్రతిష్ట ప్రపంచ దృష్టిని ఆకట్టుకోలేదా అది కదా హిందూదర్మాన్ని ప్రజల ముంగిటికి చేర్చేది. అమరావతిలో లేదా ఇతర ప్రాంతాలలో వందల కోట్లు పెట్టి నమూన ఆలయాలను, కళ్యానమండపాలను నిర్మించి హిందూదర్మాన్ని కాపాడుతారా ? అందుకే అర్దం లేని వాదనలను రాయలసీమ ప్రజలు ముఖ్యంగా తిరుపతి ప్రజలు సమైఖ్యంగా తిప్పికొట్టాలి.

తిరుపతికి పొంచి ఉన్న ప్రమాదం……
TTD ఉన్నదన్న పేరుతో రాష్ట్రం విద్యా, వైద్య సంస్దల బాద్యత తమకు సంబందంలేదు అన్న రీతిలో వ్యవహరిస్తుంది. మరో వైపు TTD ఉన్న విద్యాసంస్దలను ఒక దశలో వదిలించుకోవాలనే ఆలోచనకు వచ్చింది. స్విమ్స్ , రూయాలు ఉన్నా అత్యవసర వైద్యం కావాలంటే చైన్నైకి లేదా సీ యం సీ కి వెల్లాలి ఇది అతి పెద్ద హిందూదార్మిక సంస్ద ఉన్న తిరుపతి ప్రజలకు పట్టిన దుస్దితి. విచ్చలవిడిగా రాయలసీమ, తిరుపతి దాటి నిదులు వెల్లితే తిరుపతి అబివృద్దికి ఆటంకం ఏర్పడుతుంది. నేడు కోట్ల రూపాయిలతో ఇతర ప్రాంతాలలో నిర్మాణాలు చేపట్టితే బవిష్యత్ లో జరిగే పరిణామం నిర్వహణ ఖర్చు TTD కి తడిసి మోపెడవుతుంది. విచ్చలవిడిగా రాజకీయ కారణాలతో నిర్మించిన కళ్యానమండపాలను నేడు స్దానికి సంస్దలకు లేదా డ్వాక్రా సంఘాలకు అప్పగించి ఖర్చులను తగ్గించు కోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ఆదాయం వచ్చే చోట మాత్రం సలహ మండల్లకు అప్పంగించి వారి ఆదాయానికి మార్గం ఏర్పాటు చేస్తుంది. ఏ కోణంలో చూచినా ఈ నడక తిరుపతికి, TTD కి తీవ్ర నష్టం తప్పదు. అందుకే TTD నిదులు సంస్ద నిర్వహణ, బక్తుల సౌకర్యాలు పోను మిగిలిన నిదులను పూర్తిగా తిరుపతి అబివృద్దికి కేటాయించాలి. TTD అవసరాల కోసం కొనుగోలు చేసే వస్తువులను రాయలసీమ ప్రాంతం నుండి కొనుగోలు చేయాలి.

రాజకీయ పార్టీలు తమ వైకరిని వెల్లడించాలి…..
TTD నిదుల దారిమల్లింపుకు వ్యతిరేకంగా కాంగ్రస్ పార్టీ ప్రత్యక్ష ఆందోళనకు పూనుకోవడం మంచి పరిణామం. రాజకీయ విదానాలతో ముడిపడి ఉన్న ఈ సమస్య పరిష్కరం రాజకీయంగానే జరగాలి. అధికార పార్టీ తన రాజకీయ అవసరాల కోసం TTD నిదులను దారి మల్లిస్తుంది. ఈ నేపద్యంలో ప్రదాన ప్రతిపక్షం తన వైకరిని తెలియ జేయాలి. చంద్రబాబు గారు చేస్తున్న ప్రజావ్యతిరేక విదానాలకు వ్యతిరేకంగా ఆందోళన చేయడం, ప్రభుత్వం స్పందించ కుంటే తాము అధికారంలోకి వచ్చిన వెంటనే సరిదిద్దుతామని మాట ఇస్తుంది. TTD విషయంలో కూడా ప్రతిపక్షం తన వైకరిని వెల్లడించడం కనీస దర్మం. హిందూమత ఉద్దరణకోసం తాము ఉన్నామని మాట్లాడే భాజపా కూడా తన వైకరిని ప్రకటించాలి. ప్రపంచ ప్రసిద్ది గాంచిన హీందూ దార్మిక సంస్ద బవిష్యత్ ను ప్రమాదంలోకి నెడుతున్న TTD , రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలపై స్పందించడం భాజపా బాద్యత. మిగిలిన రాజకీయ పార్టీలు కూడా స్పందించడం ప్రస్తుత అవసరం. ప్రజలు తమ, తమ రాజకీయ పార్టీలు, నాయకులపై వత్తిడి తెచ్చి TTD నిదులను దారి మల్లించే పద్దలను అరికట్టడానికి నడుంబిగించాలి.
– Purushotham Reddy Makireddy

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*