తిరుమల అర్చకులు మరణిస్తే… అంత్యక్రియల్లో టిటిడి పాటించే సంప్రదాయం ఏమిటో తెలుసా..!

తిరుమల శ్రీవారి ఆలయంలో తరతరాలుగా అర్చకత్వం చేస్తున్నవారు అంటే వంశపారంపర్య అర్చకులు మరణిస్తే… ప్రత్యేక సంప్రదాయాలతో‌ అంత్యక్రియలు నిర్వహిస్తారు. టిటిడి కొన్ని మర్యాదలు పాటిస్తుంది.‌

ఒక చందనపు కర్ర, ఒక పరివట్టం, ఒక నిప్పును, ఒక డోలు, ఒక నాదస్వరం, ఒక పంచముఖంతో పోటు నుండి ఒక వ్యక్తి… శ్రీవారి ఆలయం నుండి ఊరేగింపుగా శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం వెనక వైపునకు తీసుకొస్తారు. అక్కడ సంబంధిత వ్యక్తులకు‌ అందజేస్తారు. అంత్యక్రియలకు వీటినే వినియోగిస్తారు.

తిరుమల ఆలయ ప్రధాన అర్చకునిగా పనిచేసి, ఆ మధ్య టిడిపి ప్రభుత్వ హయాంలో అర్దాంతరంగా రిటైర్డ్ చేయబడిన పెద్దింటి‌ శ్రీనివాసమూర్తి దీక్షితులు కరోనాతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియలను‌ టిటిడి సంప్రయాదాల మేరకు నిర్వహిస్తామని ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. – ధర్మచక్రం ప్రతినిధి

ఈ చిత్రంలో హారతి ఇస్తున్నది కరోనాతో కన్నుమూసిన శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చ శ్రీనివాసమూర్తి దీక్షితులు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*