తిరుమల క్యూకాంప్లెక్స్‌లో….అల్పాహారం ఆరగించడానికి స్పూన్లు!

తిరుమల శ్రీవారి దర్శనం కోసం క్యూకాంప్లెక్స్‌లో వేచివుండే భక్తులకు టిటిడి నిరంతరం అన్నపానీయాలు పంపిణీ చేస్తుంది. ఉదయం ఉప్మా, పొంగల్‌, కిచిటీ, మధ్యాహ్నం సాంబారు అన్న, పెరుగన్నం, రాత్రి ఉప్మా, పొంగల్‌ వంటివి పెడుతుంది. తిరుమలలో ప్రధాన కూడళ్లలోనూ ఉచితంగా ఇవన్నీ అందజేస్తుంది. వాడిపారేసే కప్పుల్లో వడ్డిస్తుంటారు. అయితే…తినడానికి స్పూన్‌ వంటిది ఇవ్వడం లేదు. ప్రధానంగా క్యూకాంప్లెక్స్‌లో చేతులు కడుక్కోడానికి నీళ్లు అందుబాటులో ఉండవు. బాత్‌రూంల వద్ద ఉన్నా ఒక్కోసారి షెడ్‌లకు తాళాలు వేసివుంటారు. ఇలాంటప్పుడు ఆహారం అందజేసినా…తినడానికి ఇబ్బందిపడుతున్నారు. తినేసి చెయ్యి కడుక్కోకుండా స్వామి దర్శనానికి వెళ్లలేరు. సాంబర్‌ అన్నం విపరీతమైన వేడిగానూ ఉంటుంది. ఉత్తిచేత్తో తినడం ఇబ్బంది అవుతుంది. దీన్ని గమనించిన టిటిడి క్యూ కాంప్లెక్స్‌లో ఆహారం ఆరగించడానికి వాడిపారేసే స్పూన్లనూ అందజేయనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫైలు ఓకే అయినట్ల సమాచారం. వారం పది రోజుల్లోనే స్పూన్లు రెడీ కానున్నాయి.

1 Comment

Leave a Reply

Your email address will not be published.


*