తిరుమల తొలి విలేకరి…తమిళనాట సంచలనాలు..!


తిరుపతి కేద్రంగా పని చేసిన పాత్రికేయుల అనుభవాలను గ్రంథస్తం చేయాలన్న ప్రయత్నంలో భాగంగా 2014 చివర్లో నేను (ఆదిమూలం శేఖర్), పెన్నబడి లోకేశ్వర రెడ్డి కలిసి…కొందరు సీనియర్ జర్నలిస్టులను ఇంటర్వ్యూ చేసి, వారి అనుభవాలను… జ్ఞాపకాలను సేకరించాం. కొన్ని కారణాల వల్ల ఆ పుస్తకం బయటకు రాలేదు. ఈతరం జర్నలిస్టులు తెలుసుకోవాల్సిన ఎంతో విలువైన సమాచారం సీనియర్ పాత్రికేయులు చెప్పారు. దీన్ని కంప్యూటరుకే పరిమితం చేయడం‌ ఏమాత్రం భావ్యం కాదనిపించి, డిజిటల్ రూపంలోనైనా పాఠకులకు అందజేయడం మంచిదని అనిపించింది. ఇందులో భాగంగా, మొదటి ఇంటర్వ్యూగా… తిరుమల తొలి విలేకరి టికె విజయ రాఘవన్ అనుభవాలు..జ్ఞాపకాలు చదవండి.


ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమలలో ఇప్పుడంటే మీడియా ప్రతినిధులు లెక్కకు మిక్కుటంగా ఉన్నారుగానీ…కొన్ని దశాబ్దాల క్రితం, తిరుమలలో విలేకరులే లేనపుడు, ఆలయంలో స్వామివారి చేస చేస్తూనే… పాత్రికేయ బాధ్యతలు నిర్వర్తించారు ఆయన. ఆయన ఇచ్చిన సమాచారంతో ప్రచురితమైన వార్తలు తమిళనాట సంచలనం‌ సృష్టించాయి.‌ ఆయనే టికె విజయ రాఘవన్.

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆయంలో సుప్రభాతం చదివేవాడిని. మా కుటుంబం వారసత్వంగా ఈ పనిచేస్తూ వచ్చాను. స్వామి వారంటే నాకు ప్రీతి. సుప్రభాతం చదివే పని చేస్తున్నందున టీటీడీలో రెగ్యుర్‌ ఉద్యోగిగా అవకాశం వచ్చింది. కానీ రెగ్యుర్‌ అయితే డ్యూటీ మారుతుంటుందనే ఉద్ధేశంతో ఉద్యోగం తీసుకోలేదు. అలా ఆలయంలో ప్రతిరోజూ సుప్రభాతం చదువుతున్నందున ఆయానికి వచ్చే ప్రముఖుల వివరాలు నాకు తెలుస్తుండేవి. అలా కొన్ని పత్రికల వారు నన్ను సంప్రదించి సమాచారం తీసుకునేవారు. అంతేకానీ నేను జర్నలిస్టుగా జీతం తీసుకోలేదు. స్వామివారిపై ఉన్న భక్తితో పత్రికల్లో స్వామి వారి గురించి ప్రచారం వస్తే బాగుంటుందని పత్రికలకు సమాచారం ఇస్తూ వచ్చాను. దినతంది పత్రికకు ఎక్కువగా సమాచారం ఇచ్చేవాడిని. అలా నన్ను అందరూ ఒక రిపోర్టర్‌గానే గుర్తించేవారు. నా వయసు 92 ఏళ్లు. నేను 1923 నుంచి శ్రీవారి ఆయంలో సుప్రభాతం చదివేవాడిని. అలా పత్రికలకు రిపోర్ట్‌ చేసే విషయంలో నాకు కొన్ని ఆరుదైన అనుభవాలు ఎదురయ్యాయి.

శివాజీ గణేషన్‌ వచ్చినపుడు..
ప్రముఖ తమిళ నటుడు శివాజీ గణేషన్‌ 1955లో అనుకుంటా….తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అందులో ప్రత్యేకత ఏముందని అనుకుంటున్నారా? అవును ప్రత్యేక ఉంది. శివాజీ గణేషన్‌ నాస్తికుడిగా ఉన్నారు. ఉన్నట్లుండి ఒకసారి తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. మంచిదే నాస్తికులు ఆస్తికులుగా మారవసిందే. ఇది చాలా ముఖ్యమైన విషయంగా భావించి దినతంది కార్యాయానికి ఫోన్‌ చేశా. అవునా..శివాజీ గణేషన్‌ తిరుమలకు వచ్చారా? అని ఆశ్చర్యపోయారు. అవునని చెప్పాను. కచ్చితంగా చెప్పండి ఏదైనా తేడా వస్తే ఇబ్బంది అవతుంది..అని వారు అన్నారు. లేదు లేదు నేను స్వామివారి భక్తుడిని అబద్ధాలు చెప్పాల్సిన పనిలేదని చెప్పాను. ఏమి ఆధారం ఉందని అడిగారు. ఆత్మే సాక్షి అన్నాను. తిరుమకు వచ్చి స్వామిని దర్శించుకున్నవారు….నేను తిరుమకు వెళ్లలేదని అబద్ధం చెప్పడానికి సాహసించరని కూడా చెప్పాను. దీంతో వారు నా సమాచారాన్ని విశ్వసించారు. నాస్తికుడు శివాజీ గణేషన్‌ ఆస్తికుడిగా మారారు…తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్వించకున్నారని దినతంది పత్రికలో వార్త వచ్చింది.  శివాజీ గణేషన్‌ చెన్నై వెళ్లేప్పటికి పత్రికల్లోనూ, గోడలపై పోస్టర్లు వెలిశాయి. ఆ తర్వాత శివాజీ గణేషన్‌ కూడా తాను తిరుమల  శ్రీవారిని దర్శించుకున్నట్లు అంగీరించారు. ఆ తర్వాత మరోసారి శివాజీ గణేషన్‌ తిరుమలకు వచ్చారు. వీరరాఘవన్‌ ఎవరు అని అడిగి, నావద్దకు వచ్చి మాట్లాడారు. మీకు ఏమి కావాల్సినా చెప్పండి…నేను సాయం చేస్తాను అని చెప్పారు. నేను స్వామివారి భక్తుడిని నాకు ఏమీ వద్దు….మీరు ఏమైనా ఇవ్వానుకుంటే స్వామివారికే ఇవ్వండి…అని చెప్పాను. స్వామి వారికి ఏమి ఇవ్వాలో చెప్పండి అన్నారు. స్వామివారికి ఒక ఎనుగును కానుకగా ఇవ్వండి అని కోరాను. అప్పుడు శివాజీ గణేషన్‌ ఒక ఏనుగును కొని స్వామివారికి కానుకగా ఇచ్చారు.

రజినీకాంత్‌ పెళ్లి ఇక్కడే..
సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌, లత వివాహం తిరుమలోనే జరిగింది. రజినీకాంత్‌ తిరుమలలో పెళ్లిచేసుకుంటారని సమాచారం వచ్చింది. తిరుమలలో వేదిక ఎక్కడో కనుక్కొని చెప్పండి అని దినతంది పత్రిక ఎడిటరు అప్పట్లో నాకు ఫోన్‌ చేశారు. తిరుమలలో విచారించాను. ఎక్కడా రజినీకాంత్‌ పేరుతో గది కానీ, అతిథి గృహం కానీ బుక్‌కాలేదు. ఇదే విషయం వారికి చెప్పాను.  ఆ తర్వాత 43వ రోజు రజినీకాంత్‌, లత, వారి స్నేహితులు, సన్నిహతు తిరమలకు వచ్చారు. తోమాల సేవ టిక్కెట్లు తీసుకున్నారు. అప్పట్లో తోమా సేవ టికెట్టు పదమూడు రూపాయులు. ఒక్కో టికెట్‌పై ఐదుగురిని అనుమ తించేవారు. అలా ఇరువురూ పదేసి టిక్కెట్లు తీసుకుని తోమాలసేవలో పాల్గొన్నారు. స్వామివారికి అర్చకులు కళ్యాణం చేస్తుండగా, అదే సమయంలో రజినీకాంత్‌…లత మెడలో మంగళసూత్రం కట్టాడు. అలా రజినీకాంత్‌ వివాహం ఇక్కడే జరిగింది.

మేయర్‌ కుచేర్‌ కూడా వచ్చారు…
తిరుమల శ్రీవారిని మద్రాసు మేయర్‌ కుచేర్‌ దర్శించకున్నారు. ఆ సమాచారాన్ని కూడా నేను దినతంది పత్రికకు ఇచ్చాను. ఆ వార్తను వేశారు. మేయర్‌ మద్రాసుకు వెళ్లి ఆ వార్తను ఖండిరచారు. ఖండన పంపిచారని ఎడిటరు నాకు ఫోన్‌ చేశారు. ఖండన వద్దు…అలా వేస్తే మనం ఇచ్చిన సమాచారం తప్పు అని అంగీకరించినట్లు‌ అవుతుందని చెప్పాను. అయితే మేయర్‌ కుచేర్‌ తిరుమకు వచ్చినట్లు ఆధారాలు పంపండి అని అడిగారు. మేయర్‌ కుచేర్‌ కారు నెంబరు అలిపిరి టోల్‌గేటు వద్ద నమోదు అయ్యింది. అలానే ఆయన తిరమలలో బస చేసిన గది వివరాలు కూడా పంపాను. దీంతో అప్పట్లో మేయర్‌ ఖండన కాకుండా నేను పంపిన వివరాతో వార్త వచ్చింది. ఆ తర్వాత మేయర్‌ కుచేర్‌ ఏదో సర్దిచెప్పుకునే రీతిలో మాట్లాడి, ఆ తర్వాత సైలెంట్‌ అయిపోయారు.

నెహ్రూ వచ్చినపుడు….
మనదేశ ప్రధానిగా జవహర్‌లాల్‌ ఉన్నప్పుడు ఆయన ఒకసారి తిరుమకు వచ్చారు. దీనికి ముందుగా ప్రధాని కార్యాయం నుంచి భద్రతాధికారి వచ్చి వెళ్లారు. ఆలయాన్ని చూసి వెళ్లారు. కొద్ది రోజు తర్వాత నెహ్రూ వచ్చారు. రేణిగుంటకు విమానంలో వచ్చి అక్కడి నుంచి భారీ కాన్వాయ్‌తో సహా వచ్చారు. నేను కూడా తిరుపతికి వెళ్లాను. తిరుపతిలో రిపోర్టర్లంతా కాన్వాయ్‌ వెంట తిరుమకు రావాలని ప్రయత్నించారు. కానీ సాధ్యపడలేదు. నేను కూడా వారితోపాటే ఆలా చూస్తుండిపోయాను. కానీ ఇంతలో తిరుమలకు ముందుగా వచ్చి చూసి వెళ్లిన భద్రతాధికారి నన్ను చూసి గుర్తుపట్టి తన కారులో ఎక్కించుకున్నారు. అలా నెహ్రూ కాన్వాయ్‌లో ప్రయాణించే అవకాశం నాకు కల్గింది. అంతా తిరమల శ్రీవేంకటేశ్వర స్వామి అనుగ్రహమే.

లతా మంగేష్కర్‌…వైజయంతిమాలతో…
ప్రముఖ నేపథ్యగాయని లతా మంగేష్కర్‌ ఒకసారి తిరుమలకు వచ్చారు. స్వామివారిని ఏమి కోరుకున్నారు అని నేను అడిగాను. మీరు పత్రికల్లో రాయనంటే చెబుతానని అన్నారు. సరేనన్నాను. ఆమెకు ఎదో ఒక గడం ఎదుయ్యిందట. అప్పట్లో స్వామివారిని ప్రార్థించి కాపాడమని కోరుకున్నారట. ఆతర్వాత గండం నుంచి గట్టెక్కించడంతో స్వామివారికి మొక్కు తీర్చుకోవడానికి వచ్చినట్లు ఆమె చెప్పారు. కానీ అప్పట్లో నేను ఈ విషయాన్ని పత్రికకు సమాచారం ఇవ్వలేదు. ఎందుకంటే పత్రికకు సమాచారం ఇవ్వనని మాట ఇచ్చాను కాబట్టి. ఆ గండం ఏమిటనేది కూడా నాకు చెప్పారు. ఒకసారి నేను ముంబయిలో మా బంధువుల ఇంటికి వెళ్లాను. ప్రముఖ నటి వైజయంతిమాల, బాలి తిరుమలకు వచ్చినప్పుడు నాకు పరిచయం ఏర్పడిరది. నేను ముంబయికి వచ్చానని తెలిసి ఆమె నన్ను ఇంటికి ఆహ్వానించారు. ఆశీర్వచనం ఇవ్వండని అడిగారు. నేను ఇంటికి వెళ్లాను. ఆమె భర్త డాక్టర్‌ బాలి అప్పట్లో వైద్యుల సమస్యపై నిరసన ప్రదర్శనకు వెళ్లాడానికి సిద్ధంగా ఉన్నారు. అరగంటలో వచ్చేయండి స్వామి అని నన్ను కోరారు. విషయం చెప్పారు.  సరేనని నేను ఇంటికి వెళ్లి  వైజయంతిమాల, బాలి దంపతులను ఆశీర్వదించాను. ఇంతలో అప్పటి సీఎం నుంచి వారికి ఫోన్‌ వచ్చింది. మీ సమస్యను ప్రభుత్వం పరిష్కరిస్తుంది మీ నిరసన ప్రదర్శనను ఆపి చర్చకు రండి అని ఆహ్వానించారు. దీంతో వైజయంతిమాల, బాలి దంపతులు‌ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.

ఇలా నాకు తిరుమలో శ్రీవారి సేవలో ఉంటూనే పత్రికకు సమాచారం ఇవ్వడం వల్ల రిపోర్టర్‌గా నన్ను అందరూ గుర్తించారు. కానీ నేను పత్రిక నుంచి డబ్బు ఇస్తామన్నా నేను తీసుకోలేదు. అంతా స్వామివారి సేవగా భావించాను.
– టికె విజయ రాఘవన్‌, తిరుమల

7 Comments

  1. చాలా ఆసక్తికరంగా ఉన్న అనుభవాలు. మీకు, లోకేష్ కి అభినందనలు. తిరుపతి లోనూ, తిరుమల లోనూ పనిచేసిన జర్నలిస్టులకు కొన్ని ప్రత్యేకమైన అనుభవాలు ఉంటాయి. ఇవి రికార్డ్ కావలసినవి. ఇప్పటికే కొందరిని కోల్పోయాం. ఇవి కొనసాగించండి, జర్నలిజానికి మంచి కాంట్రిబ్యూషన్ అవుతుంది. పుస్తకం రూపంలో తీసుకు రావలసిన రచన.

  2. చదువుతున్నoత సేపు ఉద్వేగం..ఆవురు ఆవురుమని చదివా..ధన్యవాదాలు..మంచి ఆర్టికల్ ఇచ్చినందుకు.

  3. అన్నా నేను రాజేష్ తిరుమల వాస్తవ్యుడిని మీరు ప్రజలకు తెలియని చాలా ఉపయోగకరమైన సమాచారాన్ని తెలియజేసారు చాలాకాలం నాటి వాస్తవాలను నేటి వారికి తెలపాలి అని మీరు తలపెట్టిన ఈ మహత్తర కార్యక్రమం నిర్విరామంగా కొనసాగాలని కోరుకుంటున్నాను

  4. తిరుమలకు సంభందించి ప్రతిది ఒక ప్రత్యేకమే‌….ప్రస్తుతం తిరుమలలో ఉన్న విలేఖరులకు విజయ రాఘవన్ గారి అనుభవాలి, జర్నలిస్ట్ వృత్తి విలువలను నేర్చుకోవడంలో ఉపయోగపడుతుందని ఆశీస్సున్నాను

Leave a Reply

Your email address will not be published.


*