తిరుమల లడ్డూలోకి లక్ష్మీదేవి డాలర్‌ ఎలావచ్చింది?

అనంతపురం జిల్లా రాయదుర్గంకు చెందిన తిమ్మప్పశెట్టి, ప్రమీల దంపుతులు శ్రీవారి దర్శనానికి వెళ్లి తీసుకొచ్చిన తిరుమల లడ్డూను చుట్టుపక్కల వారికి పంచుతుండగా…లడ్డూ లోపల లక్ష్మీదేవి డాలరు కనిపింది. దీనిన చూసి ఆ దంపుతులు…శ్రీనివాసుడే లక్ష్మీదేవి రూపంలో తమను కరుణించాడని ఉప్పొంగిపోతున్నారు. భక్తుడిగా ఆయన పరవశించడాన్ని చూసి మనమూ సంతోషించొచ్చుగానీ…ఇంతకీ లడ్డూలోకి లక్ష్మీదేవి డాలరు ఎలా వచ్చిందనేది ప్రశ్న. గతంలో ఇనుప ముక్కలు వంటివి లడ్డూల్లో కనిపించడంతో రగడ రగడ అయింది. ఇప్పుడు లక్ష్మీదేవి డాలర్‌ వచ్చింది. లడ్డూలు తయారుచేసే కార్మికుల మెడలోని చైను నుంచి ఏమైనా జారిపడి లడ్డూల్లో కలిసిపోయిందా అనేది పరిశీలించాలి. చైను కూడా జరిపోయివుంటే…అప్పుడే దొరికి ఉండాలి…లేదంటూ ఇంకో లడ్డూలో అదీ కూడా ఎవరికైనా దొరకాలి. లడ్డూలు శుచిగా, సుభ్రంగా ఉండేందుకు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నట్లు టిటిడి అధికారులు చెబుతున్నా …ఎప్పటికప్పుడు ఇలాంటివి జరుగుతున్నాయి. లడ్డూల్లో కనిపించింది లక్ష్మీదేవి డాలరే కదా అని వదిలేయకుండా…అది ఎలా వచ్చిందో తేల్చాల్సిన బాధ్యత టిటిడి అధికారులపై ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*