తిరుమల శ్రీవారికీ కరోనా ఎఫెక్ట్…! కరోనా నివారణ కోసం టిటిడి ధన్వంతరీ యజ్ఞం.. !!

తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి విచ్చేసే భ‌క్తుల‌కు మార్చి 17వ తేదీ మంగ‌ళ‌వారం నుండి టైంస్లాట్ టోకెన్లు జారీ చేయడం ద్వారా యాత్రికులను నేరుగా శ్రీవారి దర్శనానికి అనుమతించనున్న‌ట్లు టిటిడి ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు.‌ తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్ధీని దృష్ఠిలో ఉంచుకుని రాష్ట్ర ప్ర‌భుత్వ ఆదేశాల మేర‌కు క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ‌కు టిటిడి తీసుకున్న నిర్ణ‌యాల‌ను వివ‌రించారు. 

టైంస్లాట్ టోకెన్లు జారీ

  • మార్చి 17వ తేదీ నుండి వైకుంఠం క్యూ కాంప్లెక్స్- 1 మ‌రియు 2ల‌లో  వేచి ఉండ‌కుండా టైంస్లాట్ టోకెన్లు పొందిన భ‌క్తుల‌ను నేరుగా శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి అనుమ‌తించ‌నున్న‌ట్లు తెలిపారు. 
  •  భ‌క్తులు కంపార్ట్ మెంట్లలో వేచి ఉంటే కరోనా వ్యాప్తి చెందే అవకాశముండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియ‌జేశారు.  
  • భ‌క్తుల సౌక‌ర్యార్థం తిరుమల, తిరుపతిల‌లో టైమ్ స్లాట్లు టోకెన్లు ఇవ్వడానికి కౌంటర్లు
    అందుబాటులోనికి  తెస్తామ‌న్నారు.
  • టైంస్లాట్ టోకెన్లు తీసుకునే భ‌క్తులు త‌ప్ప‌నిస‌రిగా ఆధార్ , ఒట‌ర్ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాన్‌ కార్డు లేదా పాస్‌పోర్టు  వంటి ఏదేని గుర్తింపు కార్డున్న తీసుకు రావాల‌న్నారు. 
  • భ‌క్తులు త‌మ‌కు కేటాయించిన స‌మాయానికి ద‌ర్శ‌నానికి వ‌చ్చి టిటిడికి స‌హ‌క‌రించాల‌ని కోరారు. 

కరోనా నేపథ్యంలో ధన్వంతరి మహాయాగం

  • ప్ర‌జ‌లంద‌రు ఆరోగ్యంగా ఉండ‌డానికి స్వామివారి ఆశీస్సుల‌కై  శ్రీ శ్రీనివాస శాంత్యోత్సవ సహిత ధన్వంతరి మహాయాగం నిర్వహించనున్నట్టు వివ‌రించారు.
  • ఈ మ‌హాయాగాన్ని మార్చి 19 నుండి 21వ తేదీ వ‌ర‌కు మూడు రోజుల పాటు తిరుమ‌ల‌లోని పార్వేటి మండ‌పం వ‌ద్ద నిర్వ‌హిస్తామ‌న్నారు.  
  • విశాఖ శ్రీ శార‌దా పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ స్వ‌రూప‌నందేంద్ర స్వామివారు, మంత్రాల‌యం శ్రీ రాఘ‌వేంద్ర స్వామి మ‌ఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ సుబుదేంద్ర‌తీర్థ స్వామివార్ల ఆధ్వ‌ర్యంలో ఈ యాగం నిర్వ‌హిస్తార‌న్నారు. 

ఆర్జిత సేవ‌లు ర‌ద్దు

  • భ‌క్తులు వేచి ఉండే స‌మ‌యాన్ని త‌గ్గించేందుకు విశేష‌ పూజ, సహస్ర కలశాభిషేకం మరియు వసంతోత్సవం సేవ‌ల‌ను టిటిడి రద్దు చేసిన‌ట్లు తెలిపారు.
  •  విశేష‌ పూజ, సహస్ర కలశాభిషేకం మరియు వసంతోత్సవం సేవ‌ల‌ను ముంద‌స్తుగా పొంది, ఆర్జిత సేవ‌ల‌ ర‌ద్దు కార‌ణంగా వారికి టిటిడి అద‌న‌పు ఈవో కార్యాల‌యంలో సంప్ర‌దిస్తే విఐపి బ్రేక్ ద‌ర్శ‌నం కేటాయిస్తార‌న్నారు.  
  • ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాల‌లో భాగంగా ఏప్రిల్ 7వ తేదీన నిర్వ‌హించ‌వ‌ల‌సిన శ్రీ సీతారామూల క‌ల్యాణంను ఆల‌యం వెలుప‌ల ర‌ద్దు చేసి గ‌తంలో వ‌లే ఆల‌యం లోప‌ల నిర్వ‌హిస్తార‌న్నారు.    
  • ఏప్రిల్ 5వ తేదీన‌ ముంబాయిలో శ్రీ‌వారి ఆల‌య నిర్మాణానికి ఏర్పాటు చేసిన భూమిపూజ కార్య‌క్ర‌మాన్ని ర‌ద్ధు చేసిన‌ట్లు తెలిపారు.      

క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ‌కు చ‌ర్య‌లు

  • అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాలతోపాటు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్, కళ్యాణకట్ట, అన్నప్రసాద భవనం తదితర ప్రాంతాల్లో థర్మల్ స్క్రీనింగ్ చేయడం జరుగుతుంద‌న్నారు.
  • భ‌క్తులు ఎక్కువ‌గా ఉండే పిఏసిలు, అన్న‌ప్ర‌సాదం కాంప్లెక్స్‌, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌, క‌ల్యాణ‌క‌ట్ట, సేవాస‌ద‌న్‌ త‌దిత‌ర ప్రాంతాల్లో ప్ర‌తి 2 గంట‌ల‌కోసారి ప‌రిశుభ్ర‌త(శానిటైజ్‌) చ‌ర్య‌లు చేపడుతున్నాం. 
  • వ‌స‌తి గ‌దులను భ‌క్తులు ఖాళీ చేసిన త‌రువాత ఒక గంట పాటు స‌రైన విధంగా శుభ్రం చేసిన త‌రువాత మ‌రొక‌రికి కేటాయిస్తాం. 
  • తిరుమల లోని ఆరోగ్య విభాగం కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు. ఇది 24 గంటలపాటు పని చేస్తుంది.  యాత్రికులు 0877 – 2263447  నంబరుకు ఫోన్ చేసి కరోనా వ్యాప్తి  నివారణ చర్యలను తెలుసుకోవచ్చు.
  • కరోనా వ్యాధి వ్యాప్తి నివారణ చర్యలపై ఇప్పటికే టీటీడీలోని అన్ని విభాగాల అధికారులకు అవగాహన కల్పించడం జరిగింది. అధికారులు ఆయా విభాగాల సిబ్బందికి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.
  • అలిపిరి వద్ద యాత్రికులకు కరోనా వ్యాధి ల‌క్ష‌ణాల‌ను ప్రాథ‌మికంగా గుర్తిస్తే తిరుమ‌ల‌కు అనుమ‌తించ‌కుండా రుయా ఆసుప‌త్రిలోని ఐసోలేష‌న్ వార్డుకు పంపేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*