తిరుమ‌ల‌లో వాట‌ర్ బాటిళ్ల నిషేధం స‌క్సెస్ అవుతుందా…! ఈ నిర్ణ‌యం స‌రైన‌దేనా..! ప్ర‌త్యామ్నాయం లేదా…!

పర్యావరణ పరిరక్షణ పేరుతో తిరుమలలో వాటర్‌ బాటిళ్లను నిషేధించారు. దివ్యక్షేత్రమైన తిరుమల‌ను ప్లాస్టిక్‌ రహితంగా తీర్చిదిద్దాన్న ఆలోచనలో భాగంగా ముందుగా ప్లాస్టిక్‌ కవర్లను నిషేధించిన టిటిడి…ఆ తరువాత ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిళ్లనూ తిరుమల‌కు అనుమతించకూడదని నిర్ణయించింది. ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిళ్లకు ప్రత్యామ్నాయంగా గాజు సీసాలు, రాగి బాటిళ్లు వినియోగంలోకి తీసుకురావాని ప్రయత్నిస్తోంది. ఈ నిర్ణయం వివాదాస్పదం అవుతోంది.

తిరుమకు రోజూ 70 వేల నుంచి లక్ష మంది భక్తులు వస్తుంటారు. తిరుమల‌ వ్యాపితంగా ఆర్‌ఓ ప్లాంట్లు ఉన్నప్పటికీ….భక్తు వాటర్‌ బాటిళ్లను కొనుగోలు చేసి దాహం తీర్చుకుంటారు. రోజూ వేలాది నీటి వాటిళ్లు సేల్‌ అవుతుంటాయి. ఈ సంక్రాంతి నుంచి ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిళ్లను నిషేధించారు. భక్తులు తమతో పాటు గాజు సీసాలుగానీ, రాగి ప్లాస్సుగానీ తెచ్చుకుంటే…ఆర్‌ఓ ప్లాంట్ల వద్ద నీళ్లు పట్టుకోవచ్చని అధికారులు ప్రకటించారు. దీనికి తోడు ఎవరైనా గాజు నీటి సీసాలు ప్ర‌వేశ‌పెడితే అనుమతిస్తామని ప్రకటించారు. దీంతో ఓ కంపెనీ ముందుకు వచ్చింది. 750 మి.లీ. బాటిల్‌ ధర రూ.40గా నిర్ణయించారు. నీళ్లు తాగేసి బాటిల్‌ వెనక్కి ఇస్తే రూ.20కే ఇస్తారు.

దీనిపైన భక్తులు నుంచి వ్యతిరేకత వ్యక్తవముతోంది. 750 ఎంఎల్‌ బాటిల్‌ రూ.40 ఏమిటని ప్రశ్నస్తున్నారు. రూ.20తో పోయేదానికి రెట్టింపు చెల్లించాల్సిన అవసరం ఏముందని ఆదేవన వ్యక్తం చేస్తున్నారు. ప్లాస్టిక్‌ బాటిల్‌తో ఉన్నంత సౌకర్యంగా గాజు బాటిల్‌తో ఉంటుందా అంటున్నారు. రోడ్డుపైన వెళుతున్నప్పుడు చెయ్యిజారి బాటిల్‌ కిందపడితే….గాజు పెంచుకు ప్రమాదకరంగా మారుతాయని అంటున్నారు. ఇవన్నీ టిటిడి అధికారులు ఆలోచించలేదా అని నిదీస్తున్నారు.

ఈ పరిస్థితుల్లో గాజు నీటి సీసా ప్రయోగం ఎంత వరకు సక్సెస్‌ అవుతుందనేది అటుంచితే….అసు ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిళ్లను నిషేధించాల్సిన అవసరం ఉందా అనేది ప్రశ్న. దేశంలో చాలా నగరాల్లో ప్లాస్టిక్‌ కవర్ల నిషేధం ఉందిగానీ ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిళ్లపై నిషేధం లేదు. ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిళ్లు ప్రభుత్వ నిబంధనకు, ప్రమాణాకు అనుగుణంగానే ఉంటాయి. అటువంటప్పుడు ఎందుకు నిషేధించాలి..? తిరుమలో పోగయ్యే ప్లాస్టిక్‌ బాటిళ్లను సక్రమంగా సేకరించి రీసైకిలింగ్‌కు పంపిస్తే సరిపోతుంది. దీనిద్వారా టిటిడికి అదనపు ఆదాయం కూడా వస్తుంది.

టిటిడి వైపు నుంచి జాగ్రత్త తీసుకుంటే సరిపోయేదానికి….ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిళ్లనే నిషేధించడం… నిత్యం వేలాది భక్తు ఇబ్బందిపడే పరిస్థితి తలెత్తింది. ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిళ్లు నిషేధించిన టిటిడి…మొన్న వైకుంఠ ఏకాదశి రోజున భక్తు కోసం టిటిడినే క్షలాది ప్లాస్టిక్‌ వాటర్‌ బాటళ్లను తెప్పించి పంపిణీ చేసింది. విఐపిలు తమతో పాటు ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిళ్లను తీసుకొస్తారు. అటువంటి వారిని అడ్డుకునే పరిస్థితి టిటిడికి ఉందా అనేది కూడా మరో ప్రశ్న.

ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిళ్లను నిషేధించడంపై కొన్ని బహుళజాతి కంపెనీలు కోర్టును ఆశ్రయించనున్నట్లు తొస్తోంది. జాతీయ స్థాయి ప్రమాణాల‌కు లోబడి ఉత్పత్తయిన వస్తువును కూడా ఎవరి ఇష్టానుసారం వాళ్లు నిషేధిస్తే….వ్యాపారం ఎలా సాగుతుందని ఆ కంపెనీ ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. అందుకే సమస్యను ప్రభుత్వ పెద్ద దృష్టికి తీసుకెళ్లి, అప్పటికీ పరిష్కారం కాకుంటే కోర్టును ఆశ్రయించాని ఆలోచిస్తున్నారు.

ఈ నేపథ్యంలో టిటిడి అధికారులు పునరాలోచన చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిళ్లను నిషేధించడానికి బదులు….వాడి పారేసిన బాటిళ్లను తిరిగి సేకరించడానికి పకడ్బందీ ప్రణాళిక సిద్ధం చేయాలి. అవసరమైతే తిరుమకు నీటి బాటిళ్లు సరఫరా చేస్తున్న కంపెనీల‌ సహకారం కూడా తీసుకోవచ్చు. ఖాళీ బాటిళ్లను సేకరించడానికి ప్రతిబాటిల్‌పై అర్ధ రూపాయి చెస్‌ రూపంలో వసూలు చేసినా….రోజుకు రూ.25 వేల‌ దాకా వస్తుంది. ఆ నిధుతో 100 మందిని నియమించి తిరుమలో ఒక్క వాటర్‌ బాటిల్‌ కనిపించకుండా సేకరించొచ్చు. ఇటువంటి ఆలోచనతో మాత్రమే సమస్య పరిష్కారం అవుతుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*