తెలుగుదేశం కార్యకర్తల చెంప చెళ్లుమనిపించిన బాలకృష్ణ…!

సినీ నటుడు, హిందూపురం శాసన సభ్యులు నందమూరి బాలకృష్ణ….తన వద్దకు వచ్చే అభిమానుల చెంప చెళ్లుమనిపిస్తారన్న విమర్శులున్నాయి. ఆయన తన అభిమానుల చెంపపై కొట్టిన దృశ్యాలు పలు పర్యాయాలు మీడియాలో ప్రసారమయ్యాయి. ఈసారి ఏ అభిమానిపైనా చెయ్యి చేసుకోలేదు గానీ…తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోభావాపై బలంగానే కొట్టారు. ఇంతకీ ఏమయిందంటే…

చిత్ర పరిశ్రమలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో బాలకృష్ణ ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. నాగబాబు చేసిన కామెంట్స్‌ గురించి ఏదో మాట్లాడారు. ఆ అంశాలను పక్కనపెడితే…రాజకీయ ప్రస్తావనలూ వచ్చాయి.

జూనియర్‌ ఎన్‌టిఆర్‌ రాజకీయ రంగ ప్రవేశ గురించి యాంకర్‌ అడిగిన ప్రశ్నకు బాలకృష్ణ సమాధానం ఇస్తూ….జూనియర్‌ ఎన్‌టిఆర్‌ సినిమాల్లో మంచి క్రేజ్‌లో ఉన్నారు. ఆయనకు సినిమాల్లో ఇంకా చాలా భవిష్యత్తు ఉంది. అటువంటి వ్యక్తిని రాజకీయాల్లోకి రమ్మని ఎలా చెబుతాను… అని వ్యాఖ్యానించారు. అసలు జూనియర్‌ ఎన్‌టిఆర్‌ రాజకీయాల్లోకి రావాలన్న భావన బాలకృష్ణకు ఉందా అనేది ప్రశ్న.

ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. మొన్నటి ఎన్నికల్లో ఘోరజయం ఎదురయింది. పార్టీ అధినేత చంద్రబాబుకు వయసు మీద పడుతోంది. పార్టీని నడిపించే నాయకుడు అవసరం. తన తనయుడు నారా లోకేష్‌ను తన స్థానంలో నిలబెట్టాని బాబు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. మొన్నటి‌ ఎన్నికల్లో గెలిచివుంటే లోకేష్ ను ముఖ్యమంత్రి చేసేవారు. అయితే లోకేష్‌ మాత్రం బాబు ఆశలు, ఆకాంక్షల మేరకు స్థాయిని అందుకోలేకున్నారు. ఆయనకు నాయకత్వ లక్షణాలు లేవన్నది తెలుగుదేశం శ్రేణుల నిశ్చితాభిప్రాయం. లోకేష్‌ నాయకత్వంలో పార్టీ పునర్జీవనం కష్టమే అనేది టిడిపిలో సర్వత్రా ఉన్న అభిప్రాయం.

ఈ పరిస్థితుల్లో జూనియర్‌ ఎన్‌టిఆర్‌ ఓక్కరే పార్టీని గట్టెక్కింగలరని టిడిపి కార్యకర్తులు, నాయకులు గట్టిగా నమ్ముతున్నారు. చంద్రబాబుకు, లోకేష్‌కు కోపం వస్తుందని ఈమాట బహిరంగంగా చెప్పకపోవచ్చుగానీ అందరి అభిప్రాయమూ అదే. జూనియర్‌ని ఆహ్వానించి పార్టీ పగ్గాలు అప్పగించాని అందరూ కోరుకుంటున్నారు.

2004 ఎన్నికల్లో జూనియర్‌ ఎన్‌టిఆర్‌ను తెలుగుదేశం పార్టీ ప్రచారానికి వాడుకుంది. జూనియర్‌ వాగ్దాటి, నాయకత్వ క్షణాలను చూసి..ఇతనే భవిష్యత్తు నాయకుడని పార్టీ కార్యకర్తంతా ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే…జూనియర్‌ వస్తే, తన కుమారుడు లోకేష్‌కు స్థానం లేకుండా పోతుందని చంద్రబాబు ఆందోళన చెందారు. దీంతో ఎన్నికల తరువాత మెల్లగా జూనియర్‌ ఎన్‌టిఆర్‌ను పక్కన పెట్టేశారు.

ఇది జూనియర్‌కు, ఆయన తండ్రి కీ.శే. హరిక్రిష్ణకు మనస్తాపం కలిగించింది. 2004 ఎన్నిక తరువాత ఈ ఇద్దరూ టిడిపికి దూరంగా ఉంటూ వచ్చారు. 2014 ఎన్నికల్లోనూ జూనియర్‌ ఎన్‌టిఆర్‌ తెలుగుదేశం పార్టీ కోసం ప్రచారం చేయలేదు. 2015 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాక హరిక్రిష్ణను దగ్గర చేసుకోవాని చంద్రబాబు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఇంతలోనే హరిక్రిష్ణ కన్నుమూశారు.

2004 ఎన్నికల్లో జూనియర్‌ ప్రతిభను గమనించిన చంద్రబాబు…తనదైన శైలిలో పావులు కదిపారు. లోకేష్‌కు జూనియర్‌ అడ్డు లేకుండా చేయడం కోసం ఎత్తు వేశారు. తన కుమారుడు లోకేష్‌కు, బాలకృష్ణ కుమార్తె బ్రహ్మణితో వివాహం జరిపించారు. దీంతో ఎన్‌టిఆర్‌ కుటుంబం నుంచి ఎదురులేకుండా పోయింది. బాలకృష్ణ కూడా తన అల్లుడు లోకేష్‌ని సిఎంగా చూడాని కోరుకుంటున్నారు. అయితే లోకేష్‌కు అంత సమర్థత లేదని తేలిపోయింది.

ఈ నేపథ్యంలో మళ్లీ ఇప్పుడు జూనియర్‌ ఎన్‌టిఆర్‌ పేరు వినిపిస్తోంది. అతనొక్కడే పార్టీని రక్షించగడన్నది పార్టీ శ్రేణుల నమ్మకం. పార్టీలోకి జూనియర్‌ రావాల్సిందే అనే ప్రచారం టిడిపిలో చాపకింద నీరులా సాగుతోంది. ఇదే ఇటు చంద్రబాబుకు, అటు బాలకృష్ణకు ఆందోళన కలిగిస్తోంది. పార్టీ లోకేష్‌ చేతుల నుంచి జారిపోకూడదని వియ్యంకులిద్దరూ ఆలోచిస్తున్నారు.

ఈపూర్వ రంగం అర్థమైనపుడే బాకృష్ణ చేసిన వ్యాఖ్యల్లోని మర్మం ఏమిటో అర్థమవుతుంది. పార్టీని నిబెట్టడం కోసం అవసరమైతే జూనియర్‌ను తీసుకొస్తామని ఆయన మాట వరకు కూడా చెప్పలేదు. ఏదో ఎన్‌టిఆర్‌పైన ప్రేమ ఉన్నట్లు, ఆయన సినిమా కెరీర్‌ పాడైపోతుందన్నట్లు మాట్లాడారు. ఇది కచ్చితంగా టిడిపి శ్రేణులను చెంపమీద కొట్టినట్లే అవుతుంది. అనివార్యంగా లోకేష్ నాయకత్వాన్ని‌ ఆమోదించాల్సిన పరిస్థితి.‌ అదలావుంచితే బాబాయ్‌ చేసిన వ్యాఖ్యలపై జూనియర్‌ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

-ఆదిమూలం శేఖర్‌, సంపాదకులు, ధర్మచక్రం

1 Comment

  1. ప్రజలకాంక్ష బలమయిందైతే…..రాజకీయ చదరంగంలో బుడ్డోడి ఎత్తులు వేసే సమయం వస్తుంది సార్

Leave a Reply

Your email address will not be published.


*