‘తెలుగుదేశం బాగా పుంజుకున్నట్లు తెలుస్తోంది’

రాజకీయ పార్టీల స్థితిగతులపై ఎప్పుటికప్పుడు అనేక సంస్థలు సర్వేలు నిర్వహిస్తుంటాయి. ఎన్నికలు కాలంలో ఈ సర్వేల ఉధృతి మరీ ఎక్కువగా ఉంటుంది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది కూడా గడువులేదు. ఇక సర్వేలపై సర్వేలు వస్తూనే ఉంటాయి. ఏదో ఒక సర్వే పేరుతో ప్రముఖ తెలుగు దినపత్రిక ఒక వార్తను ప్రచురించింది. సర్వే అంటేనే అంకెలు, సంఖ్యలు. వివరాలు నిర్ధిష్టంగా ఉంటాయి. అలాకాకుండా వాతావరణ సమాచారంలగా…’రేపు పెనుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయి’ లేదా ఏదో అవినీతి అక్రమాలకు సంబంధించిన వార్తలాగా ‘తెలిసింది’ ‘విశ్వసనీయ వర్గాల సమాచారం’ అంటూ సర్వే వార్తలు రాయరు. ఈ పత్రికలో వచ్చిన వార్త చూస్తుంటే వాతావరణ వార్త, అవినీతి వార్తలాగా ఉంది. ‘ఐదు నెలల్లో పుంజుకున్న తెదేపా’ అనే శీర్షికతో ప్రచురించిన వార్త మొత్తం ఎన్నిసార్లు చదివినా….ఐదు నెలల క్రితం ఆ పార్టీకి ఎంతశాతం ఓట్లు ఉన్నాయి, ఇప్పుడెంత ఉన్నాయి అనే సంఖ్యలు లేవు. ఎన్‌డిఏకి ఓట్లు శాతం తగ్గడం, కాంగ్రెస్‌కు పెరగడం వంటి వాటికి సంఖ్యలు ఉన్నాయి. టిడిపికి విషయంలో మాత్రం ‘ప్రత్యేక హోదా అంశంలో ఎన్‌డిఏ నుంచి బయటికి వచ్చాక, ఈ ఐదు నెలల్లో తెలుగుదేశం బాగా పుంజుకున్నట్లు తెలుస్తోంది’ అని రాశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*