తొందరపాటు, తడబాటుతో శ్రీరెడ్డి ఒంటరిపాటు…చట్టపరిధిలో పోరాడితే కొత్తబలం

గత కొన్నిరోజులుగా వార్తల్లో కీలకంగా నిలిచిన సినీనటి శ్రీరెడ్డి….మంచి అంశాన్ని తీసుకుని పోరాటం మొదలుపెట్టారు. అయితే దాన్ని కొనసాగించడంలో తడబాటుకు, తొందరపాటుకు గురవుతున్నారు. దీంతో ఆమె ఒంటిపాటవ్వాల్సిన పరిస్థితి దాపురించింది. నిన్న జీవితా దబాయించినా, నేడు నాగబాబు గర్జించినా…తెలుగు సినీ పరిశ్రమలో…మహిళల పట్ల లైంగిక వేధింపులు మాత్రం వాస్తవం. అది అబద్ధం కాకుండాపోవు. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్య ఆ రంగంలోని పెద్దలపైన ఉంటుంది. మా పరిశ్రమ గురించి మీకెందుకు? అని అంటే…దానికి తగిన సమాధానమే జనం నుంచి రావచ్చు. అది ఈ రోజుకాకపోతే ఇంకోరోజు.

అసలు విషయానికొస్తే…శ్రీరెడ్డి తన పోరాటాన్ని స్థిరంగా కొనసాగించివుండాల్సింది. ఆత్మరక్షణలో పడిపోయిన సినిమా పరిశ్రమ పెద్దలు ఆత్మావలోకనం చేసుకుంటున్న తరుణంలో, శ్రీరెడ్డి గతి తప్పి మాట్లాడారు. ఈ సమస్యపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని పవన్‌ కల్యాణ్‌ సహజంగా చెప్పారు. ఆయనైన మరింత బాధ్యత ఉండొచ్చు…అది ఆయన నిర్వర్తించలేకపోయివుండొచ్చు. అంతమాత్రం దానికే…పవన్‌ను దూషించడం శ్రీరెడ్డికి తగనిపని. ‘మాదర్‌చోద్‌…’ అంటూ మధ్యవేలు చూపించడం, తన చెప్పుతో తాను కొట్టుకోవడం…ఇవన్నీ పవన్‌ను కించపరచినట్లున్నాయి. మనకు అందరూ గౌరవం ఇవ్వాలని ఎలా అనుకుంటున్నామో, మనమూ ఎదుటివారికి అలాంటి గౌరవమే ఇవ్వాలి. ఒక ప్రముఖ సినీనటుడు, రాజకీయ నాయకుడైన పవన్‌ను అంత కించపరచి మాట్లాడటం చూసిన వారికే ఎబ్బెట్టుగా ఉంది. ఇక ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు కోపం తెప్పించింది. అంతుకే తెరపైకి వచ్చిన నాగబాబు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కుటుంబ జోలికొస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ పరిణామంతో సినీ పరిశ్రమ మొత్తం ఇప్పుడు శ్రీరెడ్డికి వ్యతిరేకంగా మారింది. ఎవరూ ఆమెను సమర్థిస్తున్న వాళ్లు కనిపించడం లేదు. ఈ అనూహ్య పరిణామంతో…ఒక విధమైన మానసిక స్థితికి లోనైన ఆమె…’నేను ఒంటరిగా మిగిలాను’ అని ట్విట్‌ చేశారు. ఈ పరిస్థితులో ఆమె ఆత్మహత్య చేసుకునే ప్రమాదముందని, వెంటనే చికిత్స చేయించాలని తిరుపతికి చెందిన ఓ సైకాలజిస్టు ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టారు.

ఒక సామాజిక సమస్యగా ముందుకొచ్చిన కాస్టింగ్‌ కౌచ్‌పై పోరాడుతున్న క్రమంలో మహిళా సంఘాలు ఆమెకు అండగా నిలబడ్డాయి. ఆ సంఘాల సహకారం, సమన్వయంతో పనిచేసివుంటే ఈ సమస్యకు ఓ మంచి పరిష్కారం లభించేది. కానీ ఇప్పుడు….అన్నీ దారితప్పాయి. రాజకీయ ప్రోద్బలంతోనే శ్రీరెడ్డి ఇదంతా చేస్తోందన్న విమర్శలు వచ్చేశాయి. ఆమె తీరుకూడా అలాగే అనుమానాలకు తావిచ్చేలావుంది. ఇప్పటికైనా శ్రీరెడ్డి కుంగిపోవాల్సింది ఏమీలేదు. కాస్త…ఊపిరి పీల్చుకుని, చట్టపరిధిలో పోరాటం మొదటుపెడిడే…ఆమెకు కొత్తబలం వస్తుందనడంలో సందేహం లేదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*