థూ…ఇదేంది బిగ్ బాస్ !

బిగ్ బాస్ ఇంట్లో ఐదోవారం ఇచ్చిన టాస్క్ పరమ చెత్తగా ఉంది. ఈ టాస్క్ చేయడంలో సభ్యుల ప్రవర్తన పరమ అసహ్యంగా ఉంది. మూడు రోజుల పాటు సాగిన మంచివాళ్లు…చెడ్డవాళ్లు టాస్క్ చివరి రోజు ప్రేక్షకులకు యావగింపు కలిగించింగి. చెడ్డవాళ్ల, మంచివాళ్లు చెట్టులోని ఆపిల్ పండ్లను ఎదుటివారి నుంచి రక్షించుకునే క్రమంలో సభ్యత మరచి ప్రవర్తించారు. అంతే సిగ్గువిడిచి ప్రాసారం చేశాడు బిగ్ బాస్. యాపిల్ తీసే పేరుతో కౌశల్ తన ఎదపైన చెయ్యి పట్టాడని భానుశ్రీ రచ్చరచ్చ చేసింది. తాను అలా చెయ్యలెదని కౌశల్ చెబుతున్నా పట్టించుకోకుండా అదే ఆరోపణ చేసింది. దీనికి తేజస్వీ ఆజ్యం పోసింది. అయితే అదే టీంలో ఉన్న గీతా మాధిరి జోక్యం చేసుకుని భాను చెబుతున్నది తప్పని గట్టిగా చెప్పింది. టాస్క్ గెలవడం కోసం వ్యక్తుల కారెక్టర్ పైన అసత్య ఆరోపణలు చేయడం తప్పని వాదించింది. ఇలాగైతే తాను గేమ్ ఆడబోనని గీత నేరుగా బిగ్ బాస్ కి చెప్పింది. చాలా సేపు ఇదే అంశంపైన భానుశ్రీ వాదనకు దిగుతూ…అసభ్యంగా ప్రవర్తించారు. దీన్ని మిగతా సభ్యులు తప్పు పట్టిన తరువాత భాను మాట మార్చింది. కౌశల్ ఉద్దేశపూర్వకంగా చెయ్యిపెట్టలేదని, గేమ్ లో తగిలిందని చెప్పింది. కౌశల్ కు క్షమాపణ చెప్పింది. అర్థగంటకుపైగా జరిగిన ఈ చర్చ చూసేవారికి జుగుప్స కలిగించింది.

టాస్క్ లు ఆహ్లాదకరంగా ఉండాలి తప్ప.. అసహ్యం కలిగించేలా ఉండకూడదు. ఈ టాస్క్ మొత్తం అరాచకంగా సాగింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే టాస్క్ బాగా ఆడారంటూ బిగ్ బాస్ కితాబివ్వడం. ఇంకోసారి ఇటువంటి టాస్క్ లు వస్తే ప్రేక్షకులు టివిలు కట్టేయడం ఖాయం. అయినా ఇది మూడు రోజులు సాగదీయాల్సిన టాస్క్ కాదు. ఇచ్చే టాస్క్ లో కాస్త తెలివితేటలు, లాజిక్ ఉపయోగించేవి ఉంటే ఆహ్లాదకరంగా ఉంటాయి. వినోదం కూడా ముఖ్యమనే విషయాన్ని షో నిర్వాహకులు గుర్తించాలి. ఇదిలా ఉండగా తప్పు ఆరోపణ చేస్తూ రచ్చకు దిగిన భానుశ్రీకి ఆమె తప్పును ఎత్తిచూపి సరైన పాత్ర పోషించిన గీతా మాధురిని బాబు గోగినేని‌ అభినందించారు. గీతకు ప్రేక్షకుల ప్రశంసలూ లభిస్తున్నాయి.

టాస్క్ ముగిసిన తరువాత సరిగా ఆడని హౌజ్ మేట్ ను జైల్లో పెట్టాల్సిందిగా కెప్టెన్ కౌశల్ ను బిగ్ బాస్ ఆదేశించారు. ముందే చెప్పినట్లు అసత్య ఆరోపణలతో అసభ్య ప్రవర్తనకు దిగిన భానుశ్రీనే జైల్లో పెట్టారు కౌశల్. ఇదీ బిగ్ బాస్ ఇంటిలో 32 వ రోజు సంగతులు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*