దేవదాస్‌ హిట్టా…ఫట్టా! నాగార్జున మాటలతో అనుమానాలు!!

మల్టీ స్టారర్‌ సినిమాలుకు ఊతం ఇస్తుందనుకుంటున్న దేవదాస్‌ సినిమా శుక్రవారం విడుదల కాబోతోంది. అక్కినేని నాగార్జున, నాని కలిసి నటించిన ఈ చిత్రం ఎంతవరకు విజయవంతం అవుతుందనేదానిపై ఆసక్తినెలకొంది. ఈ ప్రత్యేక ఆసక్తికి కారణం లేకపోలేదు. సినిమాలో కీలక పాత్ర పోషించిన నాగార్జున మాటలే ఈ అనుమానాలకు కారణమవుతున్నాయి.

సినిమా ప్రమోషన్‌లో భాగంగా నిర్వహంచిన ఓ కార్యక్రమంలో నాగార్జున మాట్లాడుతూ…సినిమాను రెండు నెలల ముందుగా చూపించివుంటే కరెక్షన్‌ చెప్పడానికి, చేయడానికి వీలయ్యేది. నాకు రెండు రోజుల క్రితం చూపించారు. ఇప్పుడేమీ చేయలేం…అలా చూపించివుంటే…నిర్మాత అశ్వనీదత్‌ కూడా ఆనందంగా ఉండేవారు…అని చెబుతూ…ఏ డైరెక్టరైనా సినిమాను రెండు నెలల ముందుగానే నటులకు, నిర్మాతకు చూపించాలని నాగార్జున సూచించారు.

నాగార్జున మాటల్లోని ఆంతర్యం ఏమిటి? సినిమా ఆశించినంత బాగా రాలేదనేకదా..! నాగార్జున గతంలో నటించిన అనేక సినిమాలను కనీసం రెండు నెలలు ముందుగా చూశారట. కొన్ని మార్పులు చేర్పులు చెప్పి రీ షూట్‌ చేయించారట. అటువంటి అవకాశం దేవదాస్‌కు లేకుండాపోయింది. చిత్రంలో కీలక పాత్ర పోషించిన నటుడే ఆ విధంగా మాట్లాడినపుడు…దాన్ని ప్రేక్షకులు ఎంతమేరకు ఆదరిస్తారనే అనేమానాన్ని సినిమా పండితులు వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా హిట్టా…ఫట్టా అనేది కొన్ని గంటల్లో తేలిపోతుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*