దేవరకొండ, జూనియర్‌ ఎన్‌టిఆర్‌, నిత్యామీనన్‌….ఇప్పుడు ఫీల్‌ అవుతుంటారు!

అర్జున్‌ రెడ్డి సినిమాతో తెలుగు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న విజయ్‌ దేవరకొండ ఓ మంచి పాత్రను చేజేతులా వదులుకున్నారు. మహానటి సినిమాలో జెమినీ గణేషన్‌ పాత్ర కోసం ముందుగా దేవరకొండనే సంప్రదించారట. ఎందుకోగానీ ఆ పాత్రను నేను చేయలేనని చెప్పేశారట ఆయన. దీంతో గణేషన్‌ పాత్ర కోసం దుల్కర్‌ సల్మాన్‌ను ఎంపిక చేశారు. ఆ యువ హీరో జెమినీ గణేషన్‌ పాత్రను విరగదీశాడు. మహానటి సినిమాలో సావిత్ర పాత్రకు ఎంత ప్రాధాన్యత ఉందో…జెమినీ గణేషన్‌ పాత్రకూ అంతే ప్రాధాన్యత ఉంది. ఈ పాత్రను దేవరకొండ చేసివుంటే కచ్చితంగా ఆయన సినీ కెరీర్‌లో ఎప్పటికీ చెప్పుకోదగ్గ పాత్రగా గుర్తుండిపోయేది. ఆ పాత్రకు బదులు…ప్రెస్‌ ఫోటోగ్రాఫర్‌ పాత్రను అంగీకరించి చేశారు. సమంత రిపోర్టర్‌గా, దేవరకొండ ఫొటోగ్రాఫర్‌గా నటించారు. సమంత పాత్రకు ఉన్నంత ప్రాధానత దేవరకొండ విజయ్‌ పాత్రకు లేదు. ఈ పాత్రను ఎందుకు అంగీకరించారో, ఆ పాత్రను ఎందుకు తిరస్కరించారో తెలియదు. అదేవిధంగా సావిత్ర పాత్ర కోసం ముందుగా….నిత్యామీనన్‌ను అడిగారట. ఆమె చేయలేననడంతో కీర్తి సురేష్‌ను ఎంపిక చేశారు. ఇది కీర్తి సురేష్‌కు గొప్ప అదృష్టంగా భావించాలి. ఈ సినిమాలో ఎన్‌టిఆర్‌ పాత్ర చేయమని జూనియర్‌ ఎన్‌టిఆర్‌ను అడగారట. తన తాతగారైన ఎన్‌టిఆర్‌ పాత్ర తాను చేయలేనని చెప్పారట. దీంతో ఎవర్నీ పెట్టకుండానే…ఒరిజినల్‌ సినిమాలోని క్లిప్పింగులే చూపించారు. జూనియర్‌ ఎన్‌టిఆర్‌ అంగీకరించి, ఎన్‌టిఆర్‌ పాత్ర చేసివుంటే….ఈ సినిమాకు మరింత ఫ్లస్‌ అయ్యేది. జూనియర్‌కూ పేరొచ్చేది. ఏమైనా దేవరకొండ విజయ్‌, జూనియర్‌ ఎన్‌టిఆర్‌, నిత్యామీనన్‌ ఫీల్‌ అవ్వాల్సిన సందర్భం ఇది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*