దౌర్జన్యాల‌తో కాదు….దాసోహంతోనే టిడిపికి ఎక్కువ నష్టం..?

స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ దౌర్జన్యాల‌కు ప్పాడిరదని టిడిపి ఆరోపిస్తోంది. తమ కార్యకర్తపై దాడుకు పాల్ప‌డి నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకున్నారని విమర్శిస్తోంది. వైసిపి దౌర్జన్యం చేసివుంటే దానిపైన ఎన్నిక సంఘానికి ఫిర్యాదు చేయవచ్చు. ఆ మేరకు బాధ్యులైనవారిపైన, చూస్తూ ఊరుకున్న పోలీసుపైన, సహకరించిన ఎన్నిక సిబ్బందిపైన చర్యు తీసుకోవచ్చు.

అయితే…. అధికార వైసిపి ముందు మోకరిల్లిన తమ నేతల‌ సంగతేమిటేనేది తెలుగుదేశం పార్టీ ఆత్మ పరిశీలించుకోవాల్సిన అంశం. కొన్నిచోట్లు అధికార పార్టీ అక్రమాల‌కు ప్పాడివుండొచ్చుగానీ….చాలాచోట్ల టిడిపి నేతలు వైసిపి ముందు దాసోహం అన్నారు. లోపాయికారి అవగాహనతో నామినేషన్‌ పత్రాల‌ను వెనక్కి తీసుకున్నారు. ఇటువంటి లోగుట్టు వ్యవహారాను కూడా తెలుగు తమ్ముళ్లు తెలివిగా దౌర్జన్యాల‌ ఖాతాలోకి తోసేశారు. అగ్ర‌నాయ‌క‌త్వం కూడా ఇవేవీ తెలియ‌న‌ట్లు న‌టిస్తోంది.

తెగుదేశం పార్టీ క్షేత్రస్థాయిలో పరిశీన చేస్తే….ఎటువంటి గొడవ‌లు, ఘర్షణలు లేనిచోట కూడా తెలుగుతమ్ముళ్లు నామినేషన్లు వేయలేదు. నామినేషన్లు వేసినా, పరిశీల‌న‌లో సక్రమంగా ఉన్నాయని తేలిన తరువాత కూడా వాటిని ఉపసంహరించుకున్న ఉదంతాలు కనిపిస్తాయి. ఇలా ఎందుకు ఉపసంహరించుకున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. లక్షలాది రూపాయు చేతికి తీసుకుని పార్టీకి హ్యాండ్‌ ఇచ్చేశారు. ఇంకా కొన్నిచోట్ల జిల్లా స్థాయిలో, నియోజకవర్గాల‌ స్థాయిలో కీల‌కంగా ఉన్న నేతలే….లోపాయికారి వ్యవహారాలు, ఒప్పందాలు కుదుర్చుకున్నారన్నది బహిరంగ రహస్యం.

అందుకే… కింది స్థాయి కార్యకర్తలు నామినేషన్లు వేయడానికి సిద్ధపడినా కనీస మద్దతు ఆ నాయకుల‌ నుంచి భించలేలేదు. ఎవరి కోసమో క్షేత్రస్థాయిలో నిబడి కబడాల్సిన అవసరం ఏముందన్న భావన కూడా తెలుగు తమ్ముళ్లను లోపాయికారి ఒప్పందాల‌ వైపు పురిగొల్పింది. తమ నాయకులు అమ్ముడుపోయారని టిడిపి కార్యర్తలు వాపోతున్న పరిస్థితి ఉంది.

ప్రతి ఎంపిటిసి, జెడ్‌పిటిసి నియోజకవర్గం వారీగా వివరాలు తెప్పించుకుని విశ్లేషించుకుంటే….టిడిపి నేత‌ల‌కు అన్నీ బోధపడుతాయి. అధికార పార్టీ దౌర్జన్యాల‌ కంటే సొంత పార్టీ దోసోహంతోనే టిడిపి తీవ్రంగా నష్టపోయిందని, నష్టపోతోందని స్థానిక ఎన్నికల‌ను చూశాక చెప్పక తప్పదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*