ధర్మచక్రం ధనాధన్ వార్తలు (25.05.2020)

అమరావతికి రానున్న చంద్రబాబు : దాదాపు రెండు నెలల అనంతరం చంద్రబాబు నాయుడు‌ అమరావతికి‌ రానున్నారు. లాక్ డౌన్ ముందు హైదరాబాదు వెళ్లిన ఆయన అక్కడే ఉండిపోయారు. అమరావతి వచ్చేందుకు ప్రభుత్వం నుంచి‌ పాస్ తీసుకున్నారు.

రాష్ట్రంలో కొత్తగా 83 కేసులు : ఏపిలో కొత్తగా 83 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 2,627కి చేరుకుంది. దేశంలో మొత్తం కేసుల సంఖ్య : 1,31,868. నిన్న నమోదైన కేసులు : 6,727.

మరో నాలుగు రోజులు ఎండల తీవ్రత : ఎండలు మరో నాలుగు రోజులు ఎండలు‌ తీవ్రంగా ఉంటాయి. ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు 42 – 44 డిగ్రీలు నమోదయ్యే అవకాశముంది.

టిటిడి ఆస్తుల అమ్నకంపై తెలుగుదేశం హయాంలోనే నిర్ణయం : నిరుపయోగంగా ఉన్న ఆస్తులను విక్రయించాలని తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే నిర్ణయించినట్లు టిటిడి బోర్డు సభ్యులు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పారు. దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తే పోతారని వ్యాఖ్యానించారు.

విమాన రాకపొఇకలు ప్రారంభం : లాక్ డౌన్ తో ఆగిపోయిన విమానాల రాకపోకలు మళ్లీ సోమవారం నుంచి మొదలు కానున్నాయి. విదేశీ విమాన సర్వీసులు ప్రారంభమవుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో కి బుధవారం నుంచి విమానాలు వస్తాయి.

సోషల్ మీడియా పోస్టులపై కేసులు : సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన వారి పైన కేసులు నమోదు అవుతున్నాయి తెలుగుదేశం పార్టీకి చెందిన ఉండవల్లి అనూష తోపాటు పలువురికి పోలీసులు నోటీసులు అందజేశారు.

నేటి నుంచి మన పాలన..మీ‌ సూచన : జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి‌ ఏడాది‌ అయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని సోమవారం నుంచి నిర్వహిస్తోంది. ఇప్పటిదాకా చేపట్టిన కార్యక్రమాలు భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలు గురించి ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిపుణులు, లబ్ధిదారులతో మాట్లాడతారు. ఈ నెల 30 దాకా ప్రతి రోజు ఈ కార్యక్రమం కొనసాగుతుంది.

ఎల్ జీ పాలిమర్స్ పరిశ్రమ సీజ్ : విశాఖపట్నంలో విష వాయువులు లీకై ప్రమాదానికి కారణమైన ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమను తాత్కాలికంగా మూసివేశారు. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆదివారం ఈ చర్యలు చేపట్టినట్లు విశాఖ పోలీసులు వెల్లడించారు.

శ్రీశైలంలో కనిష్ట మట్టానికి నీళ్లు : శ్రీశైలం జలాశయం నీటి మట్టం కనీస స్థాయికి చేరుకుంటోంది. ఆదివారం జలాశయంలో నీటిమట్టం 811.90 అడుగులు ఉండగా మీరు 35.4 2 టిఎంసిలు మాత్రమే ఉంది. జలాశయాల్లో నీరు 257 టిఎంసిలకు చేరుకోగానే డెడ్ స్టోరేజీగా ప్రకటిస్తారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*