ధర్మచక్రం వార్తకు స్పందన…..పిఆర్ అతిథిగృహం కు తాళాలు


ధర్మచక్రం ప్రతినిధి – శ్రీకాళహస్తి
శ్రీకాళహస్తి పట్టణంలోని పంచాయతీ రాజ్ అతిథి గృహం ఆవరణంలోనే మందుబాబులు నిత్యం తాగితూగుతున్న విషయమై .. మందుబాబులకు అడ్డాగా పంచాయతీ రాజ్ అతిథిగృహం.. ఎటుచూసినా మందు బాటిళ్లు, గ్లాసులే అంటూ ధర్మచక్రంలో వార్త వెలువడిన విషయం విధితమే. ఈ కథనం గంటలోనే స్పందించిన పంచాయతీ రాజ్ అధికారులు కార్యాలయం ముందున్న ప్రధాన గేటుకు తాళాలు వేశారు. ఇకపై ఇక్కడ ఎవ్వరు మద్యం తాగినా తగిన చర్యలు తీసుకుంటామని, పోలీసు గస్తీ ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. స్పందించిన అధికారులకు ధర్మచక్రం శతకోటి వందనాలు అర్పిస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*