ధర్మారెడ్డితో జగన్‌కు తలనొప్పులు…! ఎస్వీబిసీలో అయోధ్య లైవ్ ఎందుకు రాలేదు..!!

అయోధ్య రామాలయ శంకుస్థాపన కార్యక్రమాన్ని టిటిడికి చెందిన ఎస్వీబిసీ ఛానల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయకపోవడం వివాదాస్పదమవుతోంది. ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ కార్యక్రమాన్ని దేశ వ్యాపితంగా 200కుపైగా ఛానళ్లు ప్రత్యక్ష ప్రసారం చేసినా….ధార్మిక ప్రచారం కోసమే ఏర్పాటైన టిటిడి ఛానల్‌ మాత్రం ఆయోధ్య కార్యాక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయకపోవడం ఏమిటని బిజెపి ప్రశ్నిస్తోంది. ఇందుకు బాధ్యులైన వారిపై 24 గంటల్లో చర్యలు తీసుకోవాని ఆ పార్టీ డిమాండ్‌ చేస్తోంది.

అయోధ్య కార్యక్రమాన్ని ఎస్వీబిసీ ఛానల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయాన్న నిబంధన ఏదీ టిటిడికి లేకపోవచ్చుగానీ… మూడు భాషల్లో ప్రసారాలు సాగిస్తూ, మూడు రాష్ట్రాల్లోనేగాక దేశ విదేశాల్లో ప్రాచుర్యం పొందిన ఎస్వీబీసిలో రామాలయ భూమిపూజ కార్యక్రమాన్ని వీక్షించాలని భక్తులు కోరుకుంటారనడంలో సందేహం లేదు. అయితే, ఎందుకు ప్రసారం చేయలేదన్నది ప్రశ్న. ఆ సమయంలో శ్రీవారి కల్యాణోత్సవం ఉంటుంది.‌ అందువల్లనే ప్రత్యక్ష ప్రసారం చేయలేదనుకుంటే…అదే విషయాన్ని ఛానల్ లో ప్రకటించి వుండొచ్చు. అప్పుడు భక్తుల్లో అపోహలు తలెత్తేవి కావు.

ప్రస్తుతం ఎస్వీబీసీ వ్యవహారాలను టిటిడి అదనపు ఈవో ధర్మారెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఈ ఛానల్‌ ఛైర్మన్‌గా ఉన్న సినీనటుడు పృధ్వీరాజ్‌ ఓ వివాదంలో చిక్కుకుని పదవి నుంచి తప్పుకున్న తరువాత…ధర్మారెడ్డి ఛానల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి అన్నీ తానై ఛానల్‌ను నడిపిస్తున్నారు.

ఇటీవ కాలంలో ఎస్వీబీసిలో ధన్వంతరీ మంత్ర పారాయణం, ఆ తరువాత సుందరకాండ పారాయణం వంటివి ప్రారంభించారు. ఈ కార్యక్రమాకు విశేషమైన ఆదరణ భిస్తోందని టిటిడినే ప్రకటించింది. ఈ క్రెడిట్‌ను ధర్మారెడ్డి తీసుకున్నారు. ఇదేసమయంలో ఆయోధ్య వివాదానికి బాధ్యత వహించాల్సింది కూడా ఆయనే.

దేశమంతా ఎదురుచూసిన అత్యంత ముఖ్యమైన అధ్యాత్మిక కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడానికి ఎస్వీబీసి సిబ్బందిని ఎందుకు అయోధ్యకు పంపలేదన్న ప్రశ్న తలెత్తుతోంది. ప్రసారం చేయాలనుకుంటే న్యూస్‌ ఏజెన్సీ ద్వారానూ ఫీడ్‌ తీసుకోవచ్చు. కారణాలు ఏమోగానీ రామాలయ భూమిపూజ కార్యక్రమం ఎస్వీబీసిలో ప్రత్యక్ష ప్రసారం జరగలేదు. అయినా పుష్కరాలు, కుంభమేళా సమయాల్లోనూ ఎస్వీబీసి ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం చేసింది. అయోధ్య కార్యక్రమాన్ని ఎందుకో పట్టించుకోలేదు.

ఎస్వీబీసీలో రోజూ తాను కనిపించడంలో ఉన్న శ్రద్ధ రామాలయ శంకుస్థాపన కార్యక్రమంపై లేదా అని ధర్మారెడ్డిని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ధవ్వంతరీ మంత్ర పారాయణం, సుందరాకాండ పారాయణం పేరుతో ధర్మారెడ్డి రోజూ లైవ్ లోకి వస్తున్నారు. ధార్మిక ఉపన్యాసాలు ఇస్తున్నారు. గతంలో ఏ అధికారీ ఈ విధంగా ఎస్వీబీసీని దుర్వినియోగం చేయలేదు…అంతటి ప్రతిష్టాత్మక ఛానల్ లో ధార్మిక ఉపన్యాసం ఇచ్చేందుకు ఆయనకు ఉన్న అర్హత ఏమిటని…టిటిడి అధికారులే చెవులు కొరుక్కుంటున్నారు.

అయోధ్య విషయంలో ధర్మారెడ్డి సరైన నిర్ణయం తీసుకోపోవడం వల్ల ప్రభుత్వం మాటపడాల్సిన పరిస్థితి వస్తోంది. మతపరమైన అంశాల్లో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డిపై కొన్ని శక్తులు దుష్ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. తిరుమలో జరిగే ప్రతి చిన్న అంశాన్ని చిలవలు పలవలు చేసి ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ తెలిసిన టిటిడి అధికారులు మరింత జాగురూకతతో ఉండాలి.

వాస్తవంగా ఇదొక్క వివాదమే కాదు….తిరుమలో తలెత్తుతున్న పలు వివాదాకు ధర్మారెడ్డి కేంద్రం అవుతున్నారు. శ్రీవారి ఆయ ప్రధాన అర్చకుగా పని చేసి, గత ప్రభుత్వంలో ఆకస్మికంగా తొగింపునకు గురయిన రమణ దీక్షితులు వ్యవహారం చూస్తే….ముఖ్యమంత్రి జగన్‌ స్వయంగా చొరవ తీసుకుని, రమణ దీక్షితులు గౌరవ ప్రధాన సలహాదారునిగా నియమించారు.

అయితే…ధర్మారెడ్డి ఆయన్ను పక్కనపెట్టేశారు. పూజా కార్యక్రమాలతో ఏ సంబంధమూ లేని డాలర్‌ శేషాద్రిని వెంటపెట్టుకుని అన్నీ నడిపిస్తున్నారు. దీంతో రమణ దీక్షితులు అసహనానికి గురవుతూ తరచూ టిటిడికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది ప్రభుత్వానికి అనవసరమైన తలనొప్పి తప్ప ఇంకొకటి కాదు. ధర్మారెడ్డి ఏమాత్రం సమతుల్యత పాటించివున్నా రమణ దీక్షితులు వివాదం తలెత్తేది కాదు. ఆయన్ను ముఖ్యమంత్రి జగన్‌ స్వయంగా నియమించారన్న స్పృత కూడా ఆయనలో కనిపించదు.

గత ప్రభుత్వ సమయంలో….శ్రీవారి ఆలయంలో పింక్‌ డైమైండ్‌ పోయిందని రమణ దీక్షితులు ఆరోపించిన సంగతి తెలిసిందే. ధర్మారెడ్డి బాధ్యతలు చేపట్టగానే పింక్‌ డైమండ్ లేదని ఓ మీడియా ఇంటర్వ్యూలో చెప్పారు. స్వామి ఆభరణాన్నీ భద్రంగా ఉన్నాయని కూడా ప్రకటించారు. ఇదే అంశాపై గతంలో విమర్శలు చేసిన విజయసాయిరెడ్డిపై అప్పటి ప్రభుత్వం కేసు పెట్టిన సంగతి తెలిసిందే. రాజకీయాల కోసమే అప్పట్లో వైసిపి నేతలు ఆభరణాల వివాదం లేవనెత్తారన్న అభిప్రాయాన్ని ధర్మారెడ్డే కలిగించారు. అంత ముఖ్యమైన అంశాన్ని వచ్చీరాగానే హడావుడిగా మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చిందని వైసిపి‌ శ్రేణులే ఆవేదన వ్యక్తం చేశాయి.

వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి ఆయంలో వైకుంఠ ద్వారాలు 10 రోజు తెరవాలన్న ప్రతిపాదన కూడా ఒకటి వివాదాస్పదమయింది. ఆ ప్రతిపాదన తెరపైకి తెచ్చింది ఎవరో అందరికీ తెలిసిందే. తర్జనభర్జనల అనంతరం, సంప్రదాయం ప్రకారం మూడు రోజు మాత్రమే ద్వారాలు తెరవాలని ఛైర్మన్ నిర్ణయించారు. అలా నిర్ణయించిన తరువాత కూడా ఈ అంశం హైకోర్టు దాకా వెళ్లింది. దాని వెనుక ఎవరు ఉన్నారో…బహిరంగ రహస్యమే.

తిరుమలలో జరుగుతున్న వ్యవహారాల గురించి, అంతర్గత విషయాల గురించి అందరికీ తెలియకపో వచ్చుగానీ…. ఇంటిలిజెన్స్‌ వర్గాల ద్వారా ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సమాచారం చేరుతూనే ఉంది. ఏదో ఒకరోజు జగన్‌ కొరడా ఝుళిపించడం ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. ఏదిఏమైనా…. ప్రభుత్వం వద్ద ఉన్న పలుకుబడితో తిరుమలకు వచ్చి, ఆ ప్రభుత్వానికే తనొప్పులు తెచ్చేలా వ్యవహరిస్తే…. జగన్‌ చూస్తూ ఊరుకుంటారా..!

-ఆదిమూలం శేఖర్‌, ఎడిటర్, ధర్మచక్రం

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*