ధ‌ర్మ‌చక్రం గురించి…

ధర్మచక్రం వారపత్రిక – అక్రమార్కుల పాలిట సుదర్శన చక్రం అనే టాగ్‌లైన్‌తో 22.10.2015న ఆవిర్భవించింది. తొలి రోజు నుంచి ప్రధానంగా ఆలయాలు, విద్యాలయాలు, వైద్యాలయాలు, రాజకీయాలు, సామాజిక అంశాలపై సంచలన కథనాలు, ఆసక్తికర విశ్లేషణలు అందిస్తోంది. పాఠకుల అభిమానాన్ని విశేషంగా చూరగొంది.

రోజువారీ వ్యవహారాలనూ అక్షరబద్ధం చేయడం కోసం ధర్మచక్రం.ఇన్‌ వెబ్‌సైట్‌ 10.04.2018న పురుడుపోసుకుంది. మొదటి రోజు నుంచే వెబ్‌సైట్‌కు అనూహ్య స్పందన వ్యక్తమయింది. ధర్మచక్రం పత్రికకు తోడు డిజిటల్‌ మీడియాను ప్రారంభించడంపై పాఠకులు ఎంతగానో సంతోషించారు. వారం వారం సంచలనంగా మారిన ధర్మచక్రం ఇప్పుడూ రోజూ సంచలనమే.

ధర్మచక్రం నీతికి, నీజాయితీకి నిలెవెత్తు నిదర్శనం. అవినీతి, అక్రమాల తలను తెగ నిరికే సుదర్శన చక్రం. పెద్దపెద్ద మీడియా సంస్థలు రాయలేదని కథనాలనూ ధర్మచక్రం అందిస్తుంది. ప్రజా ప్రయోజనాలే పరమావధిగా ముందుకు సాగుతుంది. పాఠకులే మాకు అండ దండ.

మా చిరునామా :
6-38ఎ, ఎస్‌వి నగర్‌, తిరుపతి రూరల్‌, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌,
సెల్‌ : 8686122179, 9550660137