నమ్మకాన్ని నిబెట్టుకున్న కరుణాకర్‌ రెడ్డి…. టిటిడి కార్మికుల కొనసాగింపు..!

తిరుపతి శాసన సభ్యులు భూమన కరుణాకర్‌ రెడ్డి, ప్రజాప్రతినిధిగా తనపై టిటిడి కార్మికుల్లో ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. టిటిడిలో అర్ధంతరంగా తొగింపునకు గురయిన 1400 మంది కార్మికులను విధుల్లో కొనసాగించేందుకు విశేషమైన కృషి చేశారు. ఛైర్మన్‌ వైవి సుబ్బారెడ్డితోనూ, ప్రభుత్వ పెద్దలతోనూ మాట్లాడి సమస్యను వేగంగా పరిష్కరించారు. దీంతో కార్మికుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

తిరుమల, తిరుపతిలోని యాత్రీకుల వసతి సముదాయాల్లో పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్న 1400 మంది ఎఫ్‌ఎంఎస్‌ (ఫెసిలిటీ మేనేజ్‌ మెంట్‌ సర్వీసెస్‌) కార్మికులను ఈనెల 1వ తేదీన అర్ధంతరంగా విధుల నుంచి తొగించారు. ప్రస్తుతం పని చేస్తున్న కాంట్రాక్టర్‌ గడువు ముగియడం, లాక్‌డౌన్‌ వల్ల స్వామివారి దర్శనాలు ఆపేయడం, దీంతో భక్తులు లేక కాటేజీల కేటాయింపు రద్దవడం, కార్మికులకు పని లేకపోవడం, కొత్త కాంట్రాక్టురు నియామకం జరగకపోవడం….ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని కార్మికులను విధుల నుంచి తొలగించాలని టిటిడి నిర్ణయించింది.

కార్మికులతో మాట్లాడుతున్న కరుణాకర్ రెడ్డి

కరోనా కష్టకాలంలో టిటిడి తీసుకున్న నిర్ణయం కార్మికులకు శరాఘాతంలా తగిలింది. ఈ నిర్ణయంతో నిర్ఘాంతపోయిన కార్మికులు ఆందోళనబాట పట్టారు. సిఐటియు ఆధ్వర్యంలో ధర్నాకు పూనుకున్నారు. ఇదే సమయంలో స్థానిక శాసన సభ్యుడైన భూమన కరుణాకర్‌ రెడ్డి స్పందించారు. ఆందోళనకు పూనుకున్న కార్మికుల వద్దకు వెళ్లి మాట్లాడారు. ఎట్టిపరిస్థితుల్లోనూ సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

ఈ సమస్యపై టిటిడి ఛైర్మన్‌ వైవి సుబ్బారెడ్డితో మాట్లాడారు. గడచిన రెండు దశాబ్దాలుగా టిటిడిలో పారిశుద్ధ్య కార్మికులు పోషిస్తున్న పాత్రను వివరించారు. ఇదే అంశంపై ప్రభుత్వ పెద్దలతోనూ చర్చించారు. సమస్య తీవ్రతను అర్థం చేసుకున్న వైవి సుబ్బారెడ్డి కూడా వెంటనే సానుకూలంగా స్పందించారు. ఒకటో తేదీ సాయంత్రమే ఆయన మీడియాతో మాట్లాడుతూ…‘స్థానిక ఎంఎల్‌ఏ కరుణాకర్‌ రెడ్డి కూడా చెబుతున్నారు. కార్మికులకు న్యాయం చేస్తాం’ అని చెప్పారు.

ఈ హామీ మేరకు….2వ తేదీ రాత్రికల్లా సమస్యను పరిష్కరించారు. ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టరునే ఇంకో నెల పాటు కొనసాగించాని నిర్ణయించారు. ఇంతలోపు కొత్త కాంట్రాక్టర్‌ నియామకం ప్రక్రియ పూర్తిచేసి, కార్మికులను బ్రేక్‌ లేకుండా విధుల్లో కొనసాగించాన్న నిర్ణయానికి వచ్చారు. ఇదే విషయాన్ని కార్మికులకు తెలియజేశారు.

ఇది రెండు రోజుల పాటు తీవ్ర ఆందోళనకు గురియన 1400 మంది కార్మికులకు ఎంతో ఊరట కలిగించింది. కార్మికులను కొనసాగించాన్న నిర్ణయం స్థానికంగా ఎంఎల్‌ఏ కరుణాకర్‌ రెడ్డికి మాత్రమే కాదు…ప్రభుత్వానికి కూడా మేలు చేస్తుంది. కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని పాదయాత్ర సమయంలోనే జగన్‌ మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే గత ఎన్నికల్లో టిటిడిలో పనిచేసే కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులు ఏకపక్షంగా వైసిపిని బలపరచి ఓట్లు వేశారు. ఈ పరిస్థితుల్లో కార్మికులను తొగిస్తే….ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేది. ముఖ్యమంత్రి మాట తప్పారన్న విమర్శలూ వచ్చేవి.

ఇటువంటి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని, రాజకీయంగా జరిగే నష్టాన్ని అంచనా వేసుకున్న కరుణాకర్‌ రెడ్డి వెంటనే రంగంలోకి దిగి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకున్నారు. ఏదిఏమైనా కరోనా కష్టకాలంలో 1400 మంది కార్మికుల బతుకులు రోడ్డున పడకుండా ఆపి, తనపై కార్మికుల్లో ఉన్న నమ్మకాన్ని కాపాడు కున్నారు. తమకు అండగా నిలిచిన సిఐటియు నేతలకు, చొరవ తీసుకుని సమస్య పరిష్కరించిన ఎంఎల్‌ఏ కరుణాకర్‌ రెడ్డికి, ఛైర్మన్‌ వైవి సుబ్బారెడ్డికి, టిటిడి ఉన్నతాధికారులకు కార్మికులు ధన్యవాదాలు తెలియజేశారు. – ధర్మచక్రం ‌ప్రతినిధి, తిరుపతి

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*