నల్ల బ్యాడ్జీలను ఆ విధంగానైనా అనుమతిస్తే మంచిదే…కానీయండి!

టిటిడి ప్రతిష్టను దిగజార్చే విధంగా రమణ దీక్షితులు ఆరోపణలు చేస్తున్నారంటూ….ఆయన ధోరణికి నిరసనగా నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేయాలని టిటిడి ఉద్యోగులు నిర్ణయించారు. 24వ తేదీ నుంచి మూడు రోజుల పాటు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరుకానున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగ సంఘాలను ఉక్కుపాదంతో తొక్కేశారు. చిన్నపాటి ఆందోళనలు చేసినా కేసులు బనాయించి కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు. గతంలో ధర్నాలు చేశారని ఉద్యోగ సంఘాల నాయకులను బదిలతో శంకరగిరి మాన్యాలు పట్టించారు. ఆందోళన పేరెత్తితే…’టిటిడి ధార్మక సంస్థ. ఇక్కడ ధర్నాలు, రాస్తారోకోలు, సమ్మెలు వంటివి చేయకూడదు. శ్రీవారి పవిత్రకు భగం కలుగుతుంది. భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి’ అని అధికారులు వాదిస్తారు. తమ సమస్యలు బోర్డుకు చెప్పుకోవాలని టిటిడి బోర్డు మీంటింగ్‌ జరిగే అన్నమయ్య భవన్‌ వద్దకు వెళ్లాలనుకుంటే….అదేదో దేశ సరిహద్దుల్లోకి శత్రువులు వచ్చేస్తున్నట్లు కిలోమీటరు దూరంలోనే అడ్డగించేస్తారు. అలాంటిది ఇప్పుడు రమణ దీక్షితుల పేరుతో నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగ సంఘాలు సిద్ధమయ్యాయి. ఈ విధంగానైనా టిటిడిలో ప్రజాస్వామిక హక్కులను కాపాడుతూ నల్ల బ్యాడ్జీలు ధరించడానికి అనుమతించడం ఆహ్వానించదగ్గ పరిణామమే.

ఒక‌సారి కింది లింకును ఓపెన్ చేయండి…

రమణ దీక్షితులు ఆరోపణలతో…టిటిడి ప్రతిష్ట మసకబారుతుందని వాదిస్తున్నవారి కోసమే…

1 Comment

Leave a Reply

Your email address will not be published.


*