నాకు చాలా పెద్ద శిక్ష వేశారు ..రమణ దీక్షితులు

శ్రీవారి ఆలయంలో, టిటిడిలో జరుగుతున్న అపవస్య ధోరణలుపై తీవ్ర విమర్శలు చేసి, పదవీ విరమణ పేరుతో ఉద్వాసనకు గురయిన ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు తీవ్రమైన మనో వ్యాకులతతో ఉన్నారు. టిటిడి అధికారులు తనకు చాలా పెద్ద శిక్ష విధించారని, స్వామి నుంచి దూరం చేసి తన శరీరంలో ఒక భాగాన్ని తీసినంత బాధ కలిగించరని కళ్ల నుంచి ఉబికి వస్తున్న నీటిని నియంత్రించుకుంటూ చెప్పారు. విమర్శలు చేయడం, టిటిడి ఆగమేఘాలపై ఆయన్ను తొలగించాలని నిర్ణయించడం, అంతే వేగంగా ఆయన ఇంటికి తొలగింపు నోటీసులు అంటించడం….వంటి పరిణామాల నేపథ్యంలో మొదటిసారి ఓ టివి ఛానల్‌ చర్చలో మాట్లాడారు. మొదటి నుంచి చాలా మనో నిబ్బరంగా సమాధానాలు చెబుతూ వచ్చిన ఆయన…స్వామివారికి దూరమైన ఈ రెండు రోజులుగా ఎలావున్నారు అనే ప్రశ్నతో ఒక్కసారిగా దు:ఖం ముంచుకొచ్చింది. అయినా నియంత్రింకు కుంటూ ‘నమో వేంకటేశాయ’ అని చెప్పుకుని, మైకులు తొలగించి పక్కకు వెళ్లిపోయారు.

దీనికి ముందు అనేక విషయాలను ఆయన చెప్పారు. సంచల ఆరోపణలు చేశారు. ఆలయం లోపల శ్రీవారికి నైవేద్యంగా సమర్పించే అన్న ప్రసాదాలు తయారుచేసే పోటులను ఈవోగానీ, తనకుగానీ తెలియకుండా మొత్తం ధ్వసం చేశారని చెప్పారు. ఆ సమయంలో 15 రోజుల పాటు రెండో ప్రాకారంలో ప్రసాదాలు తయారు చేయించి తెచ్చారని, ఇది అపచారమని అన్నారు. ఆగమోక్తంగా నిర్మించిన పోటులో గత 1000 సంవత్సరాలుగా స్వామివారి నైవేద్యం తయారువుతోందన్నారు. అలాంటి ఆగమ సలహాలు కూడా తీసుకోకుండా పోటును కొట్టేశారని చెప్పారు. (దీనిపై గతంలో ధర్మచక్రం ఓ కథనాన్ని ప్రచురించింది.) దీంతో తాను తాను చాలా మనోవేదనకు గురయ్యానన్నారు. అదేవిధంగా 2001లో గరుడ సేవ రోజు సామివారి మెడ హారంలోని ఓ వజ్రం కనిపిచకుండా పోయిందని, ఆ తరువాత దాన్ని విదేశాల్లో వేలం వేసినట్లు పత్రికల్లో చూశానని ఆయన చెప్పారు. రికార్డుల్లో మాత్రం భక్తులు కాసులు విసరడం వల్ల వజ్రం పలిగిలిపోయినట్లు రాశారన్నారు. నాణేలు విసరడం వల్ల వజ్రం పగిలిపోతుందా అని ఆయన ప్రశ్నించారు. మిరాశీ వ్యవస్థ ఉన్నంత కాలం స్వామివారి ఆభరణాలన్నీ భద్రంగా ఉన్నాయని, ఆ తరువాత ఏ ఆభరాణాలు ఎక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితి ఉందన్నారు. అందుకే నిష్పక్షపాతమైన విచారణ జరిపిస్తే అన్ని విషయాలూ బయటికొస్తాయని చెప్పారు.

తనకు ఇంటికి తొలగింపు నోటీసులు అంటించడం గురించి మాట్లాడుతూ..’టిటిడి అధికారులకు తనపై అభిమానం పరాకాష్టకు చేరుకుంది. అందుకే ఇవన్నీ చేస్తున్నారు’ అని నవ్వుతూ సమాధానం చెప్పారు. మీరు చేస్తున్న ఆరోపణలపై కోర్టుకు వెళతారా అని ప్రశ్నించగా….భక్తుల దృష్టికి తీసుకెళ్లాను. శ్రీవారే ఏదోఒకదారి చూపిస్తారు. ఆయనే ఆభరణాలను, ఆగమ నియమాలను కాపాడుకుంటారు అని సమాధానం ఇచ్చారు. ఇక మీ వెనుక వైసిపి, బిజెపి ఉన్నాయట కదా అని అడిగిన ప్రశ్నకు…శ్రీవారి సేవే పరమావధిగా ఉన్న మాకు రాజకీయాలు అంటగట్టకండి అని సమాధానం చెప్పారు. మొత్తంగా మరోసారి రమణ దీక్షితులు తీవ్రమైన ఆరోపణలు చేశారు. శ్రీవారి ఆలయం లోపల వంట శాలను కూల్చేశారా లేదా? ఆ విషయం ఈవోకు తెలుసా లేదా? 2001లో వజ్ర పోయిందా లేదా? ఎలా పోయింది? ఈ రెండుమూడు అంశాలపైన నిర్ధష్టమైన విచారణ జరిపిస్తే చాలని ఆయన విస్పష్టంగా చెప్పారు.

1 Comment

  1. If it was so, why he was silent for so many years.. Is he expecting the devotees to see the diamond on the Lord within fraction of seconds of darshanam and go for complaint? No, he is also responsible for the same.

Leave a Reply

Your email address will not be published.


*