నాడు చంద్రబాబు కోరిందే…నేడు రమణ దీక్షితులు అడుతున్నారా?

శ్రీవారి ఆభరణాల్లోని పింక్‌ డైమైండ్‌ కనిపించకుండాపోయిందని, దీనిపై సిబిఐ విచారణ జరిపించాలని ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు చేస్తున్న డిమాండ్‌పై తెలుగుదేశం పార్టీ తీవ్రస్థాయిలో మండిపడుతోంది. ఆయన శ్రీవారిని రాజకీయాల్లోకి లాగుతున్నారని విమర్శిస్తోంది. అయితే…ఇప్పుడు రమణ దీక్షితులు ఏ డిమాండునైతే చేస్తున్నారో అదే డిమాండ్‌ను ఒకప్పుడు చంద్రబాబు నాయుడు చేశారు. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.

భూమన కరుణాకర్‌ రెడ్డి టిటిడి ఛైర్మన్‌గా ఉన్నప్పుడు టిటిడి ఆభరణాలపై దుమారమే రేగింది. ఇప్పుడు రమణ దీక్షితులు చెబుతున్న పింక్‌ డైమైండ్‌ గురించి 2008లో అప్పటి టిటిడి సివిఎస్‌వో రమణకుమార్‌ తన నివేదికలో పేర్కొన్న విషయాలు ఆధారంగా….శాసన సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. శ్రీవారి ఆభరణాల్లోని వజ్రాలు మాయమై, రంగురాళ్లు వచ్చి చేరినట్లు ఆరోపణలు వస్తున్నాయని, దీనిపై సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. సభా సంఘం ఏర్పాటు చేయాలని కూడా కోరారు.

ఇప్పుడు అదే డిమాండ్‌ను రమణ దీక్షితులు చేస్తుంటే….చంద్రబాబు ప్రభుత్వం తొసిపుచ్చుతోంది. ఆయన రాజకీయం చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తోంది. చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శ్రీవారి ఆభరణాల భద్రతపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఇది జరిగింది 2008-2009 మధ్యలో. ఆ తరువాత ఎన్నికల్లోనూ చంద్రబాబు ప్రభుత్వంలోకి రాలేదు. 2014లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు. శ్రీవారి ఆభరణాల భద్రతపై అనుమానాలున్నప్పుడు ఎందుకు విచారణ చేయించరనేది ప్రశ్న.

1 Comment

  1. This inquiry is not only for the purpose of Sri N Chandra babu naidu garu, but also for the purpose of numerous public and devotees. But, he may be thinking why should he react upon forcible allegations.

Leave a Reply

Your email address will not be published.


*