నాని సూపర్బ్…జూనియర్ ను మైమరిపించారు!

బిగ్ బాస్ షో రెండో సీజన్ కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నేచరల్ స్టార్ నాని మొదటి వారానికే సూపర్బ్ అనిపించేలా తయారయ్యారు. షో మొదటి రోజు సభ్యులను ఇంట్లోకి పంపే రోజుకంటే మొదటి వారాంతం శనివారం నాడు ఫుల్ ఎనర్జీతో అధ్బుతంగా నిర్వహించారు.

మొదటి రోజు సభ్యులను ఇంట్లోకి పంపేటపుడు వారి గురించి సరిగా వివరించలేకపోయారన్న విమర్శలు వచ్చినప్పటికీ..ఈ వారంలో సభ్యులందరి గురించి సమగ్రంగా అవగాహన చేసుకున్నట్లు అనిపించింది.

మొదటి వారంలో సభ్యులు వ్యవహరించిన తీరును మెచ్చుకోలు, సుతిమెత్తని చురకలు, సలహాలతో విశ్లేషించారు. తన మాటల చాకచక్యంతో బాబు గోగినేనితో డాన్స్ చేయించారు. ఇంటిలో కొనసాగసాగాలనే ఉత్సాహాన్ని సభ్యుల్లో నింపగలిగారు. ఇక ఒక్కో సభ్యునికి ఒకో సినిమా డైలాగు ఇచ్చి…ఆ డైలాగు ఎవరికి సరిపోతుందని భావిస్తారో వారిని ఉద్దేశించి చెప్పమనడం ఆసక్తి కలిగించింది.

మొదటి వారంలో ఇంటి నుంచి ఎవరు వెళ్లిపోతారన్నది ఆదివారం నాటి ఎపిసోడ్‌లో తేలనుంది. ఎలిమినేషన్ కి నామినేట్ అయినవారిలో సునయిన, కిరీటి సురక్షితమైనట్లు ప్రకటించారు. ఇక గణేష్ డేజర్ జోన్ లో ఉన్నట్లు సూచనప్రాయంగా చెప్పారు. చూద్దాం ఏమి జరగబోతోందో..!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*