నాన్నా….కుట్ర‌ల‌కు భ‌య‌ప‌డొద్దు : శ్రీ‌కాళ‌హ‌స్తి ఎమ్మెల్యే కుమార్తె పవిత్రారెడ్డి లేఖ

శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డికి‌ మద్దతుగా ఆయన కుమార్తె పవిత్ర రెడ్డి ఫేస్ బుక్ వాల్ మీద రాసిన బహిరంగ లేఖ ఇది…

నాన్న…

కరోనా లాక్‌డౌన్‌తో ఇబ్బంది పడుతున్న శ్రీకాళహస్తి ప్రజలకు మీరు చేసిన సాయం ఇప్పటి వరకూ ఎవరూ చేయలేదు. మీరు చేసిన సాయాన్ని ప్రజలందరూ గుర్తు పెట్టుకున్నారు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. మంచి చేస్తూ పోండి, మీ వెంట సైనికుల్లా మేము, మన శ్రీకాళహస్తి ప్రజలందరూ ఉంటాం. మీరు చేసిన మంచి శ్రీకాళహస్తి ప్రజలందరికీ తెలుసు. కానీ, పేద ప్రజలకు మీరు చేస్తున్న మంచిని చూసి ఓర్వలేక… కొందరు మీ ఎదుగుదలను అడ్డుకోవాల‌నే దురుద్దేశంతో, మీపై కుట్రలు పన్ను తున్నారు. అబ‌ద్ధాల‌ను ప్ర‌చారం చేస్తున్నారు.

కానీ వాళ్లకి తెలియని విషయం ఏంటంటే…. మీరు వెనకడుగు వేయరు, వెయ్యబోరు. మీరు ఏంటో మీ క్యారెక్టర్ ఏంటో మాకు బాగా తెలుసు. ఒక బంతిని మనం ఎంత గట్టిగా నేలకు కొడితే అది అంతే వేగంతో పైకి లేస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని కొందరు కింద కొట్టాలని చూస్తున్నారు. కానీ వాళ్లకి తెలియని విషయం ఏంటంటే మీరు శ్రీకాళహస్తి ప్రజల మనసులో అంతే వేగంతో బంతి లాగా దూసుకుపోతున్నారు.

మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు మిమ్మల్ని రాళ్లతో కొట్టాలని చెప్పారు నాన్నా….కానీ నాకు ఒక డౌటు 2019 ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ తెలుగుదేశాన్ని రాళ్లతో శివమణి డ్రమ్స్ కొట్టినట్లు కొట్టి కొట్టి కొట్టి తరిమేశారు. ఇంకా రాళ్లు ఎక్కడ ఉన్నాయి నాన్నా. అలాగే పచ్చ మీడియా మీపై చేస్తున్న దుష్ప్రచారాన్ని మీరు అసలు పట్టించుకోకండి. వాళ్ళ మాటలను నమ్మే పరిస్థితుల్లో ఎవరూ లేరు.

శ్రీకాళహస్తి ప్రజలందరికీ ఒకటి చెప్పదలుచుకున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలబడే వారే నాయకుడు. అలాంటి నాయకుడే మా నాన్న, మన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు.

నాన్న నీ నవ్వే మాకు కొండంత బలం. మీరు ఎప్పుడు నవ్వుని చెదరగొట్టుకోకండి.

జై హింద్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*