నారా లోకేష్ గాలి తీసిన యూట్యూబ్ లైవ్..!

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం వచ్చిందని, జగన్మోహన్ రెడ్డి ఇంటి పేరు అసత్యమని, అసలు పేరు అబద్ధమని… ఇలా ఏవేవో మాట్లాడారు. ఏడాది పాలనలో విధ్వంసం తప్ప జరిగిందేమీ లేదని విమర్శించారు. తాము ట్విట్టర్లో పోస్ట్ పెట్టినా భయపడిపోతు న్నారని ఎద్దేవా చేశారు. అదేవిధంగా ఈ పాలన జగన్ మోహన్ రెడ్డి పాలన పైన చర్చించడానికి తాను సిద్ధంగా ఉన్నానని, టైం, ప్లేసు జగనే చెప్పాలని సినిమాల్లోలాగా డైలాగులు చెబుతూ సవాలు విసిరారు.

ఇదంతా బాగానే ఉందిగానీ…లోకేష్ మాటలను జనం‌‌ సీరియస్ గా తీసుకోలేదని అప్పటికప్పుడే తేలిపోయింది. లోకేష్ మీడియా సమావేశాన్ని దాదాపు అన్ని ఛానళ్లూ యూట్యూబ్ లో ప్రత్యక్ష ప్రసారం చేశాయి. యూట్యూబ్ లో నచ్చితే అఫ్ థంబ్ , నచ్చకపోతే డౌన్ థౌంబ్ సింబల్ మీద నొక్కడం ద్వారా లైక్, డిజ్ లైక్ చేయడం తెలిసిందే. లోకేష్ మీడియా సమావేశం వీడియోకి అప్ థంబ్ ల కంటే డౌన్ థంబ్ లే ఎక్కవగా వచ్చాయి. ‌‌టిడిపి, వైసిపి ఛానళ్లుగా ముద్రపడిన వాటిని వదిలేసి….. టివి 9, ఎన్ టివిలను పరిగణలోకి తీసుకుంటే…ఈ స్పందన వ్యక్తమయింది. ఎన్ టివి ప్రేక్షకుల్లో 90 మంది లైక్ చేస్తే 302 మంది డిజ్ లైక్ కొట్టారు. టివి 9 ప్రేక్షకుల్లో 200 మంది లైక్ కొడితే 538 మంది డిజ్ లైక్ కొట్టారు.

దీన్నిబట్టి ప్రజల అభిప్రాయాన్ని‌ అంచనా వేస్తున్నారు నెటిజన్లు. లోకేష్ మాటలను‌ జోక్ గా తీసుకుంటు న్నారంటూ వ్యగ్య పోస్టులు పెడుతున్నారు. అదేవిధంగా… తాను ట్విట్ చేసినా జగన్ భయపడి పోతున్నారని చేసిన వ్యాఖ్యలపైనా వ్యగ్య వీడియోలు పోస్టు చేస్తున్నారు. మొత్తంమ్మీద సోషల్ మీడియాకు లోకేష్ హాట్ టాపిక్ గా మారారు. – ధర్మచక్రం ప్రతినిధి

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*