నార‌దుడే…గూగుల్‌!

విచిత్ర వ్యాఖ్య‌లు చేయ‌డం బిజెపి నాయ‌కుల‌కు అల‌వాటుగా మారిపోయింది. మ‌హాభార‌త కాలంలోనే ఇంట‌ర్నెట్ ఉండేద‌ని ఒకాయ‌న అంటే…రామాయ‌న కాలంలోనే విమానాలున్నాయ‌ని ఇంకో మ‌హానుభావుడు సెల‌విస్తారు. జర్నలిజంపై బిజెపి నేత, యూపీ ఉప ముఖ్యమంత్రి దినేష్‌ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహాభారతం సమయంలోనే పాత్రికేయ వృత్తి ప్రారంభమైందని చెప్పుకొచ్చారు. హిందీ జర్నలిజం డే సందర్భంగా గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.హిందూ పురాణాల్లో దేవతలకు వార్తలను చేరవేసే నారదుడిని ఆయన ఇంటర్‌నెట్‌ దిగ్గజం గూగుల్‌తో పోల్చారు. మీ గూగుల్‌ ఇప్పుడు ప్రారంభమైతే తమ గూగుల్‌ శతాబ్ధాల కిందటే వెలుగుచూసిందని, సమాచార సారధైన నారదముని సందేశాలను ఒక ప్రాంతం నుంచి మరోప్రాంతానికి వాయువేగంతో చేరవేసేవారని అన్నారు.

ఇక హస్తినాపురంలో కూర్చుని సంజయుడు మహాభారత యుద్ధాన్ని దృతరాష్ర్టుడికి వివరిస్తాడని ఇది ప్రత్యక్ష ప్రసారం కాక మరేమిటని దినేష్‌ శర్మ ప్రశ్నించారు. సంజయుడి కళ్ల ద్వారా మహాభారత ఘట్టాలను ఇతరులు ఎలా వీక్షించారని ప్రశ్నించగా అలాంటి సాంకేతికత అప్పట్లోనే అందుబాటులో ఉందని వ్యాఖ్యానించారు. అంధుడైన ధృతరాష్ట్రుడు ఇంట్లో కూర్చుని యుద్ధ విశేషాలను తెలుసుకుంటాడని, ఇది సనాతన భారత్‌ సాధించిన విజయంగా త్రిపుర గరవ్నర్‌ తథాగథ రాయ్‌ గతంలో పేర్కొన్నారు. కాగా, మహాభారత కాలంలోనే ఇంటర్‌నెట్‌, శాటిలైట్‌ వ్యవస్థ ఉందని అస్సాం సీఎం విప్లవ్‌ దేవ్‌ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*